బీజేపీతో పొత్తు వల్ల లాభపడ్డాం, హోదాతో ఉద్యోగాలు రావు: సుజన ఆసక్తికరం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీ ఇచ్చిందని, భారతీయ జనతా పార్టీతో పొత్తు వల్ల మనం లాభపడ్డామని కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ సుజనా చౌదరి సోమవారం నాడు విజయవాడలో మీడియా సమావేశంలో చెప్పారు.

ప్యాకేజీతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. మనకు కేంద్రం మంచి ప్యాకేజీ ఇచ్చిందన్నారు. ప్రత్యేక హోదాకు సమానమైన మంచి ప్యాకేజీ, అంతకంటే ఎక్కువే ఇస్తున్నారని చెప్పారు. ప్యాకేజీతో ఏపీకి చాలా లాభమని చెప్పారు. బీజేపీ తమ మిత్రపక్షమైనందుకు తాము (ఏపీ) మంచి లాభం పొందిందని చెప్పారు.

Sujana

విపక్షాలు వృథాగా మాట్లాడుతున్నాయన్నారు. మనకు 14వ ఆర్థిక సంఘం సూచనల కారణంగా ప్రత్యేక హోదా రాలేదని చెప్పారు. మనకు వచ్చే ప్యాకేజీ ఫిగర్స్ గురించి తాను ఇప్పుడు చెప్పదల్చుకోలేదన్నారు. కానీ మనకు రావాల్సిన వాటి కంటే ఓ రూపాయి ఎక్కువే తెచ్చేలా ప్యాకేజీని తయారు చేసుకున్నామని చెప్పారు.

చంద్రబాబు నాయుడి నాయకత్వంలో రాష్ట్రం ముందుకు పోతుందన్నారు. ప్యాకేజీని ఏపీ ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతనే ప్యాకేజీని ప్రకటించారని చెప్పారు. ప్యాకేజీ వల్ల మనకు లాభమే అన్నారు. అభివృద్ధి, రాష్ట్రం ముందుకు పోయే గమ్యం చేరడమే ముఖ్య ఉద్దేశ్యమన్నారు.

హోదాను, ప్యాకేజీని పోల్చుతూ సుజన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో గ్రాం ఫోన్లు ఉండేవని, ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయని, గతంలో ఇండియన్ ఎయిర్ లైన్స్ ఉండేదని, ఇప్పుడు ఎయిర్ ఇండియా అద్భుతంగా ఉందని, టెలిగ్రాంలో పోయి ఇప్పుడు ఈ మెయిల్స్ వచ్చాయని చెప్పారు.

కేంద్రం రాష్ట్రానికి ప్యాకేజీ ప్ర‌క‌టించ‌డం మంచి ప‌రిణామమ‌న్నారు. కేంద్ర ప్ర‌క‌ట‌న‌తో పోల‌వ‌రం ప్రాజెక్టు త్వ‌ర‌గా పూర్త‌వుతుంద‌ని, అది పూర్తయితే రైతుల‌కి ఎంతో లాభం క‌లుగుతుంద‌న్నారు.

హోదా వ‌స్తే ఉద్యోగాలు వ‌స్తాయ‌ని అనుకోవ‌డం భ్ర‌మేన‌ని, హోదాతో ఉద్యోగాలు రావన్నారు. హోదా వ‌స్తే అది వ‌చ్చింద‌న్న పేరే త‌ప్పా అంత‌కు మించి రాష్ట్రానికి ఏమీ రాద‌న్నారు. హోదాతో స‌మానంగా వ‌చ్చే సాయంతో పాటు ఇప్పుడు మ‌న‌కి ప్రత్యేక ప్ర‌యోజ‌నాలు కూడా అందుతాయ‌న్నారు. హోదాతో స‌మానంగా సాయం చేస్తామ‌ని కేంద్ర‌ మాటిచ్చింద‌న్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+