కేసీఆర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్! తెగేదాకా లాగితే ఎవరికి నష్టమో చూద్దాం!: బాబు
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో చట్ట ప్రకారం ముందుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి 17 పేజీల నివేదికను తెలంగాణ ఏసీబీ అధికారులు పంపారు.
వాటిని పరిశీలించిన హోంశాఖ ఈ కేసులో పలువురు నేతల పైన వ్యతిరేకంగా ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని భావిస్తూ, ఈ మేరకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం అందాకనే కేసీఆర్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చే వైపు వడివడిగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది.
ఏసీబీ నోటీసులపై బాబు స్పందించారా?
తనకు నోటీసులు ఇచ్చే అవకాశాలున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై చంద్రబాబు స్పందించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర మంత్రులతో నేడిక్కడ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమకు నోటీసులిచ్చే అధికారం తెలంగాణ ఏసీబీకి లేదని, ఇచ్చినా తీసుకోవాల్సిన అవసరం లేదని బాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం.
Animal husbandry, which is a growth engine of primary sector, will provide jobs to one crore people in AP: CM pic.twitter.com/SnbxPnFMMn
— AP Government (@AndhraPradeshCM) June 16, 2015 ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు కేసు నమోదు చేయడానికి ఏసీబీ ఎవరంటూ తెగే దాకా లాగితే ఎవరికి నష్టమో చూద్దామని ఈ సందర్భంగా ఆయన మంత్రులతో అన్నట్టుగా సమాచారం.
కేసీఆర్ సెంటిమెంటును రెచ్చగొడుతున్నారు: నాగం
కేసీఆర్ సెంటిమెంటును రెచ్చగొడుతున్నారని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. పక్క రాష్ట్రాలతో ఆయన గిల్లికజ్జాలు పెట్టుకుంటూ సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. వరంగల్ ఎన్నికల కోసమే పాలమూరు, రంగారెడ్డి, నక్కలగండి పూర్తయిన ప్రాజెక్టులు చేపడుతున్నారన్నారు. కానీ 90 శాతం పూర్తయిన ప్రాజెక్టులను వదిలేశారన్నారు.
రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు: రఘువీరా

ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు వెళ్లి టీడీపీ నేత రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. ఏపీలో దోచుకున్న దాని పైన తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. ఇద్దరు సీఎంలను పిలిచి గవర్నర్ సమస్యను పరిష్కరించాలన్నారు.
ఓటుకు నోటు కేసును సీబీఐ విచారణ జరిపించాలన్నారు. ఏపీలో దోచుకొని తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనాలనుకుంటున్నారని మండిపడ్డారు. మొత్తం 12 అంశాలపై గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చినట్లు చెప్పారు.పథకాల పేరుతో టీడీపీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోందన్నారు.
కచ్చితమైన ఆధారాలున్నందునే: వాసిరెడ్డి పద్మ
ఓటుకు నోటు వ్యవహారంలో కచ్చితమైన ఆధారాలు ఉన్నందునే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు తెలంగాణ ఏసీబీ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైందని వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ అన్నారు. చంద్రబాబు కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కోర్టులపై నమ్మకముంటే చంద్రబాబు రాజీనామా చేయాలన్నారు. విచారణకు సిద్ధపడాలన్నారు.
ఆప్ఘనిస్తాన్‌లా తయారు చేశారు: చెవిరెడ్డి
ఏపీని ఆప్ఘనిస్తాన్‌లా మార్చారని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి చిత్తూరు జిల్లా తిరుపతిలో అన్నారు. రాష్ట్రంలో దొంగల రాజ్యం నడుస్తోందన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో పక్కా ఆధారాలున్నాయి కాబట్టే చంద్రబాబుకు నోటీసులు ఇస్తున్నారన్నారు.
దేశానికే కాక యావత్ ప్రపంచానికి బాబు చీడపురుగులా మారారని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి అన్నారు. ఆయన బురద కడుక్కునేందుకు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు. ఆయన జైలుకు వెళ్లక తప్పదన్నారు.












Click it and Unblock the Notifications