One Nation-One Election: లోక్ సభలో జమిలి బిల్లులు-వెనక్కి తీసుకోవాలన్న కాంగ్రెస్..!

దేశంలో ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన బిల్లుల్ని కేంద్రం ఇవాళ పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఇవాళ జమిలి ఎన్నికలకు సంబంధంచిన రాజ్యాంగ సవరణ బిల్లుల్ని లోక్ సభలో ప్రవేశపెట్టారు. దీనిపై విపక్ష ఇండియా కూటమి భగ్గుమంది. వెంటనే బిల్లులు వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు.

centre introduces One Nation One election Bill in Lok Sabha congress demanded to withdraw

ఇవాళ ఉదయం పార్లమెంట్ లో 'ఒక దేశం, ఒక ఎన్నికల' ప్రతిపాదన కోసం బిల్లులు ప్రవేశపెట్టే ముందు కేంద్రం..భారత ప్రజాస్వామ్యం ఎన్నికల చైతన్యంతో వృద్ధి చెందుతుందని, తరచుగా జరిగే ఎన్నికల స్ధానంలో మరింత సమర్థవంతమైన వ్యవస్థ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలోని విపక్షాలు మండిపడ్డాయి. కాంగ్రెస్‌ ఎంపీ మనీష్ తివారీ, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్, తృణమూల్‌ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ, తమిళనాడు నుంచి డీఎంకే ఎంపీ టిఆర్ బాలు దీనిపై ఘాటుగా స్పందించారు.

మరోవైపు ఎన్డీయే మిత్రపక్షమైన టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జమిలి ఎన్నికల బిల్లుల్ని బేషరతుగా సమర్థిస్తున్నట్లు లోక్ సభలో ప్రకటించారు. చంద్రబాబు విజనరీ లీడర్ అని, వికసిత్ ఆంధ్ర 2047 ప్రణాళిక తెచ్చారని, సహకార సమాఖ్య వ్యవస్థకు మద్దతునిస్తున్నారని పెమ్మసాని తెలిపారు. 2019 లోక్ సభ ఎన్నికలకే 6 వేల కోట్లు ఖర్చయిందని ఈసీ చెప్పిందన్నారు. లా కమిషన్, నీతి ఆయోగ్ రిపోర్టులు సైతం జమిలి ఎన్నికలతో ప్రయోజనం ఉంటుందని చెప్పాయన్నారు.

అన్ని పార్టీలు కలిపి ఎన్నికల కోసం లక్ష కోట్లు ఖర్చుపెడుతున్నాయన్నారు. జమిలి జరిగితే ఖర్చు భారీగా తగ్గుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+