విభజనలో 'రాయల' ట్విస్ట్: హైదరాబాద్‌కు, టికి కౌన్సిల్స్

రాయల తెలంగాణకే ఆమోద ముద్ర వేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు. జివోఎం ఈ రోజు భేటీ కానుంది. ఎల్లుండి కేబినెట్ ముందుకు విభజన అంశంపై నివేదిక ఇస్తారు. అధిష్టానం తెలంగాణ వైపు మొగ్గు చూపితే పార్లమెంటు అజెండాలో బిల్లు ఉండేదని చెబుతున్నారు. కేంద్రం రాయల టి వైపు మొగ్గు చూపుతున్నందునే శీతాకాల సమావేశాల్లో బిల్లుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటున్నారు.
అనంతపురం, కర్నూలు జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే అసెంబ్లీలో గట్టెక్కడమే కాకుండా రాజధాని, నీరు, మరో విభజనవాదం వంటి సమస్యలు పరిష్కారమవుతాయని అధిష్టానం భావిస్తోందని అంటున్నారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోను 371 డి కొనసాగింపునకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందంటున్నారు.
రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు దాదాపు సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. రాయల తెలంగాణకు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో జిహెచ్ఎంసి పరిధి మేరకు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా చేసి యూనియన్ కో ఆర్డినేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నారట. నీటి సమస్యల పరిష్కారానికి జలమండలి, హైకోర్టుకు హైకోర్టు ఆఫ్ హైదరాబాదుగా మార్పు, తెలంగాణకు ప్రత్యేక బార్ కౌన్సిల్‌లు ఉండనున్నాయంటున్నారు. రాయల తెలంగాణ నేపథ్యంలో పోలవరం ముంపు ప్రాంతాలు, భద్రాచలం తెలంగాణకే ఉండనుందంట.












Click it and Unblock the Notifications