Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీకి మరో హ్యాపీ న్యూస్: అమరావతిలో అక్కడే పార్టీ ఆఫీస్‌లు.. ఇదీ కారణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. లోకసభలో ప్రశ్నోత్తరాల సమయంలో హైకోర్టు అంశాన్ని తెలుగుదేశం ఎంపీ తోట నర్సింహం ప్రస్తావించారు.

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. లోకసభలో ప్రశ్నోత్తరాల సమయంలో హైకోర్టు అంశాన్ని తెలుగుదేశం ఎంపీ తోట నర్సింహం ప్రస్తావించారు.

ఆయన ప్రశ్నకు కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సమాధానం ఇచ్చ్రారు. విభజన చట్టం ప్రకారం హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందని, నూతన భవనాల నిర్మాణం పూర్తి కాగానే ఏర్పాటు చేస్తామన్నారు. ఈ అంశంపై రెండు రాష్ట్రాల సీఎంలతో తాను వ్యక్తిగతంగా మాట్లాడుతూనే ఉన్నానని తెలిపారు.

అమరావతికి పార్టీల కార్యాలయాలు

అమరావతికి పార్టీల కార్యాలయాలు

రాజధాని అమరావతిలో రాజకీయ పార్టీలు రాష్ట్ర కార్యాలయాల నిర్మాణానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా స్థలాల అన్వేషణ దాదాపు పూర్తి చేశాయి. టిడిపి, బీజేపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల నిర్మాణానికి ఇప్పటికే ఏర్పాట్లు చేశాయి.

టిడిపి కార్యాలయం

టిడిపి కార్యాలయం

మంగళగిరి-విజయవాడ పదహారవ నెంబరు జాతీయ రహదారి పక్కన స్థలాలు ఎంపిక చేశాయి. టిడిపి రాష్ట్ర పార్టీ సుమారు 3.5 ఎకరాల భూమిని ఎంపిక చేసింది. సాంకేతిక పరమైన సమస్యలు అధిగమించిన వెంటనే పార్టీ కార్యాలయ నిర్మాణానికి సన్నాహాలు చేయనున్నారు.

ఉగాది నాటికి స్థలాన్ని చదును చేసే పనిలో ఆ పార్టీ నాయకత్వం ఉంది. అత్యాధునిక వసతులతో టిడిపి కార్యాలయాన్ని నిర్మించనున్నారు. బహుళ అంతస్తుల్లో భవనం నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు.

పార్టీ పూర్తి స్థాయి కార్యకర్తలకు, నాయకులకు ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాట్లు చేస్తున్నారు. దూరప్రాంతం నుంచి వచ్చిన వారికి వసతి కల్పించేందుకు వీలుగా గదులు నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారు. కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించనున్నారు.

బీజేపీ కార్యాలయం

బీజేపీ కార్యాలయం

బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయం కూడా మంగళగిరి వద్ద నిర్మించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వడ్డేశ్వరం వద్ద సుమారు ఎకరం భూమిని ఆ పార్టీ నాయకుడు మాదల శ్రీనివాస రావు విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. రాష్ట్ర, జాతీయస్థాయి నాయకులను తీసుకు వచ్చి స్థలాన్ని చూపించారు. ఉగాది తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ రహదారి పక్కన రాష్ట్ర పార్టీ కార్యాలయ భవనం నిర్మించేందుకు ప్రయత్నాలను వేగవంతం చేసింది. తాడేపల్లిలోని జాతీయ రహదారి పక్కన రాష్ట్ర కార్యాలయానికి స్థలం ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు.

రాష్ట్రంలో ప్రధానమైన మూడు రాజకీయ పార్టీలు జాతీయ రహదారి పక్కన పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇందుకు కారణాలు ఉన్నాయి. గన్నవరం విమానాశ్రయం, విజయవాడ రైల్వేస్టేషన్‌, విజయవాడ బస్టాండ్‌ల నుంచి నేరుగా చేరుకునేందుకు ట్రాన్సుపోర్ట్ సదుపాయం ఉంది.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చే వారికి అన్ని విధాలా అనుకూలం. ఇక్కడి నుంచి రాజధాని సచివాలయానికి వెళ్లటానికి కేవలం 15 నిమిషాల్లో చేరుకునే వీలుంది. ఇన్ని అనుకూలతలు ఉన్నందున రాష్ట్ర కార్యాలయాలు ఇక్కడ నిర్మించేందుకు పార్టీలు ఆసక్తి చూపుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+