బాబుకు మోడీ ఊరట: 1000 కోట్ల అమరావతి ఔటర్‌కి ఓకే, ఏపీ 'స్మార్ట్' కసరత్తు
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 186 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం సూత్రపాయ అంగీకారం తెలిపింది. రాష్ట్రంలో 800 కిలోమీటర్ల రహదారులను హైవేలుగా మార్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. వెయ్యి కోట్లతో చేపట్టే ప్రాజెక్టుకు కేంద్రం అంగీకారం తెలిపింది.
కర్నూలు మీదుగా అనంతపురం - అమరావతిని కలుపుతూ జాతీయ రహదారులు 44, 65లను అనుసంధానం చేయనుంది. కర్నూలు, కడప, అనంతపురంలను కలుపుతూ జాతీయ రహదారులు 40, 65లను అనుసంధానం చేయనుంది.
నాలుగు వరుసల రోడ్ నుంచి ఆరు, ఎనిమిది వరుసల రోడ్డులు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేస్తే పనులు ప్రారంభిస్తామని కేంద్రం తెలిపింది. వెయ్యి కోట్లతో చేపట్టే ప్రాజెక్టుకు కేంద్రం అంగీకారం తెలిపింది.

స్మార్ట్ సిటీల ఎంపికకు కసరత్తు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్మార్ట్ సిటీలుగా ఎంపికైన నగరాలకు తుది జాబితాలో చోటు కల్పించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 100 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది.
ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ప్రతిపాదనలు పంపగా కొన్ని నగరాలను ఎంపిక చేసి ప్రకటించింది. వీటిలో ఏపీలోని విశాఖ, కాకినాడ, తిరుపతి నగరాలు చోటు దక్కించుకున్నాయి. ఈ నగరాల్లో పట్టణాభివృద్ధి శాఖ తొలి ఏడాది 20 నగరాలను ఎంపిక చేసి స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తుంది.
మొదటి విడతలో స్థానం దక్కించుకునేందుకు ఏపీలోని విశాఖ, కాకినాడ, తిరుపతి నగరాలు సమగ్రమైన ప్రతిపాదనలను రూపొందించేందుకు సిద్దమయ్యాయి. ప్రజాభిప్రాయాన్ని సేకరించడం ద్వారా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించుకోవచ్చని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అన్ని రాష్ట్రాలకు సూచించింది.

ఇందుకు అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని పట్టణ స్థానిక సంస్థలకు తెలిపింది. ఇప్పటికే కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ న్యూఢిల్లీ, హైదరాబాద్, కోలకాతాల్లో ప్రాంతీయ సమావేశాలను నిర్వహించింది. పట్టణాల్లో ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ నెట్‌వర్క్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించవచ్చునని భావిస్తున్నారు.
స్థానికంగా పత్రికలు, రేడియో, టీవీ, బల్క్ ఎస్‌ఎంఎస్, చిత్రాల ద్వారా సూచనలు, సలహాలు తీసుకుని స్మార్ట్ సిటీ ప్రతిపాదనలు సిద్ధం చేస్తారు.
కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్ 'మై గవ్' వెబ్‌సైట్ ద్వారా ప్రజలతో ఆయా పట్టణ స్థానిక సంస్థలు సంప్రదించవచ్చు.ప్రాథమికంగా ఎంపికైన సిటీల ప్రతిపాదనలను డిసెంబర్ 15 లోపు కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. ఈ గడువులోగా నగర సమగ్ర అభివృద్ధి వ్యూహాలతో ప్రణాళిక సిద్దం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
-
అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!! -
అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, కానీ అక్కడే- జగన్ సంచలన ప్రకటన..!! -
భారీ వర్షాలు, పిడుగులు, ఈదురు గాలులు - బీ అలర్ట్.. ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
అమరావతిపై జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్.. అంగుళం కూడా కదల్చలేవ్ -
అమరావతి బిల్లు పై పార్లమెంట్ లో వైసీపీ బిగ్ ట్విస్ట్..!! -
అమరావతిపై జగన్ ప్లాన్ 'బీ' - కొత్త రాజధాని “మావిగన్”..!! -
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
3,000 పెన్షన్, ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు.. కేరళలో బీజేపీ మేనిఫెస్టో ఇదే.. -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్..












Click it and Unblock the Notifications