వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్-తెలంగాణలకు ఓకే, ఏపీపై కేంద్రం కొర్రీలు: బాబుకు కేంద్రం షాక్

ఇటీవల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షాలు అపాయింటుమెంట్ ఇవ్వలేదు. ఇది చర్చనీయాంశంగా మారింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/అమరావతి: ఇటీవల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షాలు అపాయింటుమెంట్ ఇవ్వలేదు. ఇది చర్చనీయాంశంగా మారింది.

బిల్డింగ్‌లపై ప్రభావం: అమరావతికి ప్రకంపనల ముప్పు, ఆ భూకంపం దెబ్బకుబిల్డింగ్‌లపై ప్రభావం: అమరావతికి ప్రకంపనల ముప్పు, ఆ భూకంపం దెబ్బకు

బిజెపి, టిడిపిలు క్రమంగా దూరమవుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే రాజకీయాలకు సంబంధం లేకుండా, కేవలం ప్రభుత్వాలకు మాత్రమే సంబంధించిన ఓ అంశం చర్చకు తావిచ్చింది.

 ఏపీకి ప్రశ్నలతో కొర్రీలు

ఏపీకి ప్రశ్నలతో కొర్రీలు

ఏపీ భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు ఆమోదముద్ర వేయకుండా కేంద్రం ముప్పుతిప్పలు పెడుతోందని వార్తలు వస్తున్నాయి. ఆరు నెలలుగా కేంద్రం వద్ద పెండింగులో ఉన్న ఈ బిల్లుపై కొర్రీలు వేస్తోందని అంటున్నారు. గుజరాత్, తెలంగాణ ప్రభుత్వాల తరహాలోనే ఏపీ ప్రభుత్వ బిల్లు ఉన్నప్పటికీ ఆ రెండు రాష్ట్రాలకు ఆమోదం తెలిపిన కేంద్రం, ఏపీకి మాత్రం ప్రశ్నలు వేస్తోందని వార్తలు వచ్చాయి.

Recommended Video

Gujarat upcoming assembly elections : గుజరాత్ తీర్పు: ప్రధాని మోదీకి జీవన్మరణ సమస్య
 విషయం చెప్పండి

విషయం చెప్పండి

కేంద్ర హోంశాఖ ఏపీ బిల్లును కేంద్ర వ్యవసాయ సాఖకు పంపించిందని, దాంతో ఆ శాఖ ఆహార భద్రతకు సంబంధించిన ప్రశ్నలు వేసింది. ఆహార భద్రతపై ప్రభావం చూపుతుందని దానిని కేంద్ర వ్యవసాయ శాఖ హోంశాఖకు పంపించింది. ఈ ప్రశ్నలపై కేంద్ర హోంశాఖ ఏపీని వివరణ కోరింది.

 కొత్తగా పన్నెండు లక్షల హెక్టార్లు.. ఎక్కడ

కొత్తగా పన్నెండు లక్షల హెక్టార్లు.. ఎక్కడ

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి కొత్తగా పన్నెండు లక్షల హెక్టార్లను సాగులోకి తెస్తున్నామని, భూసేకరణ చట్టానికి తాము సవరించిన ప్రతిపాదన ఏపీలో ఆహార భద్రతపై ఎలాంటి ప్రభావం చూపదని ఏపీ వివరణ ఇచ్చింది. ఎక్కువ భూములను వరి సాగు కోసం ఉపయోగిస్తున్నారని, పైగా మరో 12 లక్షల హెక్టార్ల భూమిని కొత్తగా సాగులోకి తెస్తున్నామని ఏపీ చెప్పింది.

దానికి ఎంత సమయం పడుతుందో

దానికి ఎంత సమయం పడుతుందో

అయితే, ఏపీ వివరణతో కేంద్ర వ్యవసాయ శాఖ సంతృప్తి చెందలేదట. కొత్తగా సాగులోకి తెస్తున్న ఆ భూములు ఎక్కడెక్కడ ఉన్నదీ చెప్పాలని అభిప్రాయపడింది. ఇప్పుడు కొత్తగా 12 లక్షల హెక్టార్లను ఎక్కడ సాగులోకి తెస్తోంది కేంద్రానికి చూపించి, మెప్పించాల్సి ఉందని, దానికి ఎంత సమయం పడుతుందో అంటున్నారు.

English summary
Centre shock to Chandrababu Naidu government on land acquisition act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X