ఢిల్లీలో బాబు బిజీ: పోలవరం బాధ్యత కేంద్రానిదే
న్యూఢిల్లీ/ హైదరాబాద్: గోదావరి నదిపై తలపెట్టిన పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన జలమంథన్ సదస్సు అనంతరం చంద్రబాబు తెలుగు మీడియాతో మాట్లాడారు. పోలవరం పూర్తి అయితే కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం చేయవచ్చని తెలిపారు. మరో 50 టీఎంసీల నీటిని అదనంగా వినియోగించుకోవచ్చని వివరించారు.
గోదావరి నుంచి కృష్ణా డెల్టాకు 8 నెలల్లో నీటిని మళ్లిస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. జలవననులను సద్వినియోగం చేసుకునేందుకు వ్యవసాయానికి అధునాతన పద్దతులను అవలంభించాలని సూచించారు. వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో నదుల అనుసంధానంపై ఎంతో కృషి చేశామని గుర్తుచేశారు. రానున్న ఐదేళ్లలో కరువు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం సమావేశమయ్యారు. విభజన చట్టంలోని పలు అంశాలపై ఈ సమావేశంలో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వంతో ఏర్పడిన వివాదాలపై ఆయన ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు.
జపాన్ పర్యటన ఖరారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జపాన్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 24 నుంచి 29 వరకు జపాన్‌లో చంద్రబాబు పర్యటించనున్నారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ఏపీ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్, సీఎం రమేష్, గల్లా జయదేవ్, పరకాల ప్రభాకర్ పలువురు ఉన్నతాధికారులు సీఎం చంద్రబాబు వెంట జపాన్ వెళ్లనున్నారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు రాజధాని నిర్మాణం కోసం సలహాలను స్వీకరించడమే చంద్రబాబు జపాన్ పర్యటన ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications