వరద నష్టం రూ.3,760 కోట్లు, ఆదుకోండి: కేంద్రబృందంతో చంద్రబాబు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల రూ.3,760 కోట్ల నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర బృందాలకు వివరించారు. రాష్ట్రంలో వరదలు, కరవు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు శుక్రవారం విజయవాడలో సీఎం చంద్రబాబుతో వేర్వేరుగా భేటీ అయ్యాయి.

ఈ సందర్భంగా వారితో చంద్రబాబు మాట్లాడుతూ... అల్పపీడనం వల్ల నాలుగు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని తెలిపారు. కరవు, వరద నష్టాలను అంచనా వేసి రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోవాలని కోరారు.

Centre team met CM Chandrababu

రాష్ట్రంలో పరిస్థితులపై చంద్రబాబు ఈ బృందాలకు రెండు నివేదికలు సమర్పించారు. గత నెలలో సంభవించిన అల్ప పీడన ప్రభావంతో పలు జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు.

కేంద్రప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాలని కోరారు. ఇప్పటికే ఈ రెండు బృందాలు ఏపీలోని పలు జిల్లాల్లో స్వయంగా పర్యటించి వరద నష్టాలను పరిశీలించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+