విశాఖ నుంచి నంద్యాల మీదుగా కడపకు హైస్పీడ్ రైలు కారిడార్: జగన్ ఆదేశం
అమరావతి: విభజన తరువాత రెండు తెలుగు రాష్ట్రాలు ఎదుర్కొంటోన్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దృష్టి సారించింది. ఏపీ పునర్విభజన చట్టంపై సమీక్ష నిర్వహించనుంది. విభజన చోటు చేసుకున్న తొమ్మిది సంవత్సరాల తరువాత కొన్ని కీలక అంశాలను పరిష్కరించడానికి కసరత్తు మొదలు పెట్టింది.
ఏపీ పునర్విభజన చట్టం ఆమోదం పొంది తొమ్మిది సంవత్సరాలు దాటింది. ఆ చట్టంలోని పలు షెడ్యూళ్లల్లో పొందుపరిచిన అంశాలు పెద్దగా పరిష్కారానికి నోచుకోలేదు. 13వ షెడ్యూల్‌లో పొందుపరిచన అంశాల పురోగతిపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేడు దేశ రాజధానిలో సమావేశం కానున్నారు.

ఈ భేటీ నేపథ్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అజయ్ భల్లా నిర్వహించే భేటీలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. వారికి దిశా నిర్దేశం చేశారు. పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటినీ కేంద్రం దృష్టికి తీసుకుని రావాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విభజిత ఏపీ తీవ్ర నష్టం కలిగిందని, దీన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని వ్యాఖ్యానించారు. విభజన చోటు చేసుకుని ఇన్నేళ్లయినప్పటికీ.. చట్టంలో పేర్కొన్న అంశాలు పరిష్కారానికి నోచుకోవట్లేదని, వీలైనంత త్వరంగా వాటిని నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడిని తీసుకొస్తామని అన్నారు.
అప్పుల్లో ఏపీకి 58, తెలంగాణకు 42 శాతాన్ని కేటాయించారని, రెవెన్యూ పరంగా తెలంగాణకు 58, ఏపీకి 42 శాతం మంజూరు చేశారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా హామీని కేంద్రం ఇంకా నెరవేర్చలేదని, పోలవరం నిర్మాణానికి నిధులను మంజూరు చేయడంలో ఇంకా సమస్యలున్నాయని జగన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు అందాల్సిన విద్యుత్ బకాయిలు కూడా రావట్లేదని పేర్కొన్నారు.
పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై కేంద్ర హోం శాఖ కార్యదర్శితో జరిగే సమావేశంలో దృష్టి పెట్టాలని జగన్ ఆదేశించారు. రాష్ట్రానికి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతోనే విభజన చట్టంలో హామీలు ఇచ్చారని, వాటిని అమలు చేయడంలో జాప్యం తగదని అన్నారు. రాజధాని హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల రెవిన్యూ రూపంలో చాలా నష్టపోయామని చెప్పారు.
దీన్ని సర్దుబాటుచేస్తూ విభజన చట్టంలో ఆయా రంగాలకు సంబంధించి మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు హామీలు ఇచ్చిందని జగన్ పేర్కొన్నారు. విభజన చట్టంలో ఉన్న ఈ స్ఫూర్తి.. దాన్ని అమలు చేయడంలో కనిపించట్లేదని అన్నారు. ఈ హామీలు నెరవేరితే రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయని జగన్ వ్యాఖ్యానించారు.
అధికార వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిలో భాగంగా మూడు రాజధానులను ప్రకటించామని, వాటి ప్రాంతాల మధ్య సమాన, సమగ్రాభివృద్ధి తమ ప్రభుత్వ బాధ్యతేనని జగన్ పేర్కొన్నారు. మూడు ప్రాంతాలను అనుసంధానిస్తూ రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, రోడ్ల అనుసంధానం మొదలుకుని అన్ని రకాలుగా సమానాభివృద్ధిని సాధించడానికి కేంద్రం సహకారం అవసరమని అన్నారు.
సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీని ఏపీకి మంజూరు చేయాలని, దీనిపై అజయ్ భల్లా భేటీలో ప్రస్తావించాలని జగన్ సూచించారు. దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణం, కడపలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణం, దానికి అవసరమైన ముడి ఇనుము కోసం ఎన్‌ఎండీసీ నుంచి గనుల కేటాయింపు కోసం డిమాండ్ చేయాలని అన్నారు.
విశాఖపట్నం నుంచి రాయలసీమ ప్రాంతానికి అత్యంత వేగంగా నడిచే రైళ్ల కోసం హై స్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందిని జగన్ అన్నారు. విశాఖపట్నం నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లా మీదుగా కడపకు అత్యంత వేగంగా నడిచే రైళ్ల కోసం ఒత్తిడిని తీసుకుని రావాలి చెప్పారు. విశాఖ రైల్వే జోన్ అంశంపైనా దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
వైజాగ్, విజయవాడ, తిరుపతి ఎయిర్ పోర్టులను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా మారుస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని జగన్ గుర్తు చేశారు. విశాఖ సిటీ నుంచి భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు అనుసంధానం చేసే రహదారి అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకుని రావాలని సూచించారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు తామే భూ సేకరణ చేశామని అన్నారు.
విశాఖ మెట్రో రైలు అంశాన్నికూడా ఈ భేటీలో ప్రస్తావించాలని, భూ సేకరణ సహా మిగిలిన 40 శాతం కేంద్రం భరించేలా ఒత్తిడిని తీసుకుని రావాలని అన్నారు. రెండు రాష్ట్రల మధ్య ఆస్తుల విభజన ఇంకా పెండింగ్‌లో ఉందని, వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై దృష్టి సారించాలని జగన్ ఆదేశించారు.
-
"అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు": భారత్ స్థానం మారింది - ప్రధాని మోడీ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications