వాటర్ వార్ పై జగన్ సర్కార్ కు ఊరట- లోక్ సభలో కేంద్రం సమర్ధన- అందుకే గెజిట్
ఏపీ-తెలంగాణ మధ్య సాగుతున్న వాటర్ వార్ పై కేంద్రం ఇవాళ లోక్ సభలో స్పందించింది. లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు, కృష్ణా జలాల అంశం, పోలవరం నిధులపై చర్చకు వైసీపీ ఎంపీలు పట్టుబట్టారు. ఓ దశలో వెల్ లోకి దూసుకెళ్ళి నిరసన తెలియజేశారు. దీంతో స్పందించిన జల్ శక్తి మంత్రి సమాధానం ఇఛ్చారు.
శ్రీశైలంలో 800 అడుగల మట్టంలోనే నీటిని తోడేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా విద్యుదుత్పత్తి చేపడుతుందని ఆరోపిస్తూ వైసీపీ ఎంపీలు లోక్ సభ కార్యకలాపాలను అడ్డుకున్నారు. సభలో నిరసన తెలియజేస్తూ వెల్ లోకి వెళ్లారు. ఈ సందర్భఁగా తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ప్రస్తావించారు. విభజన చట్టం, నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని ఎంపీ అవినాష్ రెడ్డి డిమాండ్. చేశారు.

Recommended Video

అవినాష్ రెడ్డి చేసిన డిమాండ్ పై స్పందించిన కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్.. తెలంగాణ ప్రభుత్వ చర్యలపై తమకు సమాచారం ఉందన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖ కూడా తమకు అందిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వ్యవహారంపై స్పందించి ఇప్పటికే కృష్ణా, గోదావరి రివర్ బోర్డులపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన అంశాన్ని కూడా షెకావత్ గుర్తు చేశారు. దీంతో పాటు విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో వైసీపీ ఎంపీలు కాస్త శాంతించారు.












Click it and Unblock the Notifications