వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిడతలు వాయించిన టీడీపీ సభ్యులు- డబ్బులు విసిరేసిన వైసీపీ ఎమ్మెల్సీ : మండలిలో గందరగోళం..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీ శాసన మండలిలో గందరగోళం ఏర్పడింది. టీడీపీ సభ్యుల నిరసనలు..వైసీపీ సభ్యుల రియాక్షన్లతో సభ దద్దరిల్లింది. కల్తీ మద్యం వ్యవహారం పైన అసెంబ్లీ తరహాలోనే మండలిలోనూ రోజూ టీటీడీపీ సభ్యులు చర్చకు పట్టు బడుతూ ఆందోళన కొనసాగిస్తున్నారు. సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించారు. దీంతో..చర్చకు పట్టు బడుతూ ప్రతిపక్ష సభ్యులు చైర్మన్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేస్తూ చుట్టు ముట్టారు. ఛైర్మన్ తో సహా మంత్రులు సైతం వారించినా టీడీపీ సభ్యులు తగ్గలేదు.

మండలిలో చిడతలతో నిరసన

మండలిలో చిడతలతో నిరసన

ఆ సమయంలో అసెంబ్లీలో చేసిన విధంగానే మండలిలోనూ టీడీపీ సభ్యులు చిడతలు తీసుకొచ్చి ఛైర్మన్ పోడియం వద్ద వాటిని వాయించటం మొదలు పెట్టారు. దీంతో.. ఛైర్మన్ వారి పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ డబ్బులు విసిరేసారు. దీంతో..అటు టీడీపీ .. ఇటు వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్దం చోటు చేసుకుంది. డబ్బులు విసిరేసిన దువ్వాడ శ్రీనివాస్ పైన చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ సభ్యులు డిమాండ్ చేసారు. దవ్వాడ ను సస్పెండ్ చేయాలని టీడీపీ సభ్యులు నినాదాలు చేసారు.

డబ్బులు విసిరిన దువ్వాడ

డబ్బులు విసిరిన దువ్వాడ

సభలో టీడీపీ సభ్యులు చిడతలు వాయించటం పైన మంత్రులు అప్పలరాజు.. కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో..వరుసగా రెండో రోజు సభ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. అయినా.. టీడీపీ సభ్యులు అక్కడ నుంచి కదలకపోవటంతో మార్షల్స్ రంగ ప్రవేశం చేసారు. అయినా..టీడీపీ సభ్యులు కదలకపోవటంతో మంత్రి కన్నబాబు ఛైర్మన్ కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేసారు. ఇదే సమయంలో సభ్యులపైన చర్యలకు నిబంధనలు కఠినతరం చేయాలని సూచించారు. ఛైర్మన్ సభలో వారి వ్యవహార శైలిని వారికే వదిలేస్తున్నానని ఛైర్మన్ చెప్పుకొచ్చారు. సీనియర్ సభ్యుడు సీ రామచంద్రయ్య దీని పైన స్పందించారు.

చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ డిమాండ్

చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ డిమాండ్

తాను టీడీపీలో ఉన్న సమయంలో చంద్రబాబు ఏ రకంగా వ్యవహరించే వారో వివరించారు. తాము సంస్కారంతో ఉన్నా.. టీడీపీ సభ్యులు అది కోల్పోతున్నారని చెప్పుకొచ్చారు. ఛైర్మన్ సైతం కఠినంగా ఉండాల్సిదేనంటూ సభ్యులు డిమాండ్ చేసారు. శాసనసభలో కల్తీ మద్యం..జంగారెడ్డి గూడెం మరణాల పైన సీఎం జగన్ స్పష్టత ఇచ్చారని.. ఉద్దేశ పూర్వకంగానే టీడీపీ సభ్యులు సభలో గందర గోళం చేస్తున్నారంటూ మంత్రులు..వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసారు.

English summary
TDP MLC's suspended from the Council with protest near chairman podium.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X