సరయూ: చక్రపాణి అంత్యక్రియలు పూర్తి(ఫొటోలు)
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సరయూ నదిలో స్నానానికి దిగి గల్లంతై మృత్యువాత పడ్డ ఓరుగంటి చక్రపాణి అంత్యక్రియలు శుక్రవారం ఉదయం పూర్తయ్యాయి. మృతదేహాన్ని గౌతంనగర్ వాణీనగర్‌లోని చక్రపాణి నివాసం నుంచి మల్కాజిగిరి ఎస్సీనగర్‌లోని హిందూ స్మశానవాటికకు తీసుకెళ్లి తండ్రి ఓరుగంటి కృష్ణకిశోర్ చేతుల మీదుగా అంత్యక్రియలు పూర్తి చేశారు.
చక్రపాణి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు రాంచందర్ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం చక్రపాణి నివాసానికి వచ్చిన ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. చక్రపాణి జన్మించిన పేద బ్రాహ్మణ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.
నదుల వద్ద ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. రామచంద్రరావుతోపాటు బిజెపి నాయకులు రామకృష్ణ, రాంబాబు, శ్రీనివాస ముదిరాజ్, సదానంద్ గౌడ్ తదితరులున్నారు. చక్రపాణితోపాటు డబీర్‌పురాకు చెందిన కిరణ్(20) కూడా మృతి చెందిన విషయం తెలిసిందే.

చక్రపాణి అంత్యక్రియలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సరయూ నదిలో స్నానానికి దిగి గల్లంతై మృత్యువాత పడ్డ ఓరుగంటి చక్రపాణి అంత్యక్రియలు శుక్రవారం ఉదయం పూర్తయ్యాయి.

చక్రపాణి అంత్యక్రియలు
చక్రపాణి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు రాంచందర్ రావు డిమాండ్ చేశారు.

చక్రపాణి అంత్యక్రియలు
సరయూ నదిలో గల్లంతైన చక్రపాణి మృతదేహాన్ని వాణీ నగర్‌లోని అతని నివాసంలోకి తీసుకువస్తున్న దృశ్యం.

చక్రపాణి అంత్యక్రియలు
ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ కుమారుడు శవంగా తిరిగిరావడంతో తీవ్రంగా విలపిస్తున్న చక్రపాణి తల్లి.

చక్రపాణి అంత్యక్రియలు
చక్రపాణి మృతదేహాన్ని తీసుకువచ్చిన బాక్సు వద్ద విలపిస్తున్న అతని తల్లిదండ్రులు రాజేశ్వరి, కృష్ణకుమార్.

చక్రపాణి అంత్యక్రియలు
మృతదేహాన్ని గౌతంనగర్ వాణీనగర్‌లోని చక్రపాణి నివాసం నుంచి మల్కాజిగిరి ఎస్సీనగర్‌లోని హిందూ స్మశానవాటికకు తీసుకెళ్లి తండ్రి ఓరుగంటి కృష్ణకిశోర్ చేతుల మీదుగా అంత్యక్రియలు పూర్తి చేశారు.

చక్రపాణి అంత్యక్రియలు
చక్రపాణి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యదర్శి నద్దమ్ పరసు రామిరెడ్డి, ఎకె మురుగేష్.












Click it and Unblock the Notifications