'దమ్ముంటే ఏపీలో కేబినెట్ నుండి బిజెపి వైదొలగాలి',' బాబును విమర్శించడం మోసమే'
అమరావతి: దమ్ముంటే ఏపీ మంత్రివర్గం నుండి బిజెపి మంత్రులు వైదొలగాలని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ బిజెపిని నేతలను డిమాండ్ చేశారు. ఏపీ రాష్ట్రానికి బిజెపి తీవ్రమైన అన్యాయం చేస్తోందని చలసాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Recommended Video

ఏపీ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు విషయంలో అన్యాయం జరిగిందని రాజకీయ పార్టీలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఏపీకి అన్యాయం చేస్తోన్న బిజెపి నేతలు మాత్రం ఆ అన్యాయాన్ని సమర్ధిస్తున్నారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఏపీకి ప్రత్యేక హోదానే సరైన సంజీవని అన్ని పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. బిజెపికి మిత్రపక్షంగా ఉన్న టిడిపి మహరాష్ట్రలోని బుందేల్‌ఖండ్‌కు 20 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వడంతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడ ప్రత్యేక హోదాను ఇవ్వాలని డిమాండ్ చేశారు. టిడిపి, బిజెపి నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది. ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి పోస్టర్‌ను అమరావతిలో శుక్రవారం నాడు ఆ సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ విడుదల చేశారు.

బిజెపి మంత్రులు బాబు కేబినేట్ నుండి వైదొలగాలి
దమ్ముంటే బిజెపి మంత్రులు చంద్రబాబునాయుడు కేబినేట్ నుండి వైదొలగాలని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. దక్షిణ భారతదేశానికి బీజేపీ అన్యాయం చేస్తోందని విమర్శించారు. భారతదేశ పటంలో ఆంధ్రప్రదేశ్ లేకుండా చేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.

బాబును విమర్శించడం మోసమే
ఏపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును విమర్శించడమంటే ఒక రకంగా మోసం చేయడమేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. రాం మాధవ్ చెప్పినట్టు రాష్ట్ర బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

న్యాయం చేయాలని కేంద్రాన్ని నిలదీస్తాం
ఏపీ రాష్ట్రానికి న్యాయం చేయాలని పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీస్తామని టిడిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడు తోట నరసింహం చెప్పారు. సాధారణ ఎన్నికలకు ఏడాదిలోపైతే ఉప ఎన్నికలు రావన్నారు. అందుకే ఏప్రిల్‌లో వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తామంటున్నారని ఆయన విమర్శించారు. తాము పార్లమెంట్‌లో ఉండే పోరాటం చేస్తామని తోట నరసింహం వెల్లడించారు.

ప్రత్యేక హోదా ఎజెండా
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌ను రాజకీయ పార్టీలు తెర మీదికి తెస్తున్నాయి. ఏపీకి అన్యాయం జరిగిందని అన్ని పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ తరుణంలో బిజెపి, టిడిపి నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications