పవన్! నీకేం వస్తుంది, ఢిల్లీలో రహస్య ఒప్పందాలు, మోడీ తమిళనాడు పాలిటిక్స్: బాబు సంచలనం
అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఓ సభలో మాట్లాడిన ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత వైయస్ జగన్‌పై నిప్పులు చెరిగారు.
కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. అయినప్పటికీ రాష్ట్రానికి చెందిన కొందరు నేతలు బీజేపీకి వంత పాడుతున్నారని విమర్శించారు. ఢిల్లీలో రహస్య ఒప్పందాలు చేసుకొనే ప్రయత్నాలు చేసుకొని తనను టార్గెట్ చేసుకుంటున్నారని జగన్‌ను ఉద్దేశించి మండిపడ్డారు.

పవన్! నన్ను విమర్శిస్తే నీకు వచ్చేదేమిటి?
తనపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తే ఏపీకి వచ్చే ప్రయోజనం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. నన్ను విమర్శిస్తే, నన్ను తిడితే, నన్ను బలహీనపరిస్తే మీకు, రాష్ట్రానికి వచ్చే లాభం ఏమిటో చెప్పాలని నేను గట్టిగా అడుగుతున్నానని వ్యాఖ్యానించారు.

ఏపీకి ద్రోహం చేసిన బీజేపీని నిలదీయరా
పవన్ కళ్యాణ్ నాలుగేళ్లుగా మాట్లాడకుండా ఇప్పుడు తమ ప్రభుత్వం హయాంలో అవినీతి అంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇన్నేళ్ల తర్వాత ఆయనకు అవినీతి కనబడిందా అన్నారు. ఏపీకి ద్రోహం చేసిన బీజేపీని, మోడీని మాత్రం పల్లెత్తు మాట అనట్లేన్నారు.

కావాలనే అన్యాయం, అవినీతి ఇప్పుడు కనిపించిందా
బీజేపీ కావాలనే ఏపీకి అన్యాయం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ఈ కష్ట సమయంలో పవన్ తనను అనడం ఏమిటని, కేంద్రం అన్యాయం చేస్తుంటే మోడీని, బీజేపీని నిలదీయాలన్నారు. ఇదంతా దుర్మార్గం అన్నారు. ఎప్పుడూ కనబడని అవినీతి ఇప్పుడు కనిపించిందా అన్నారు.

తమిళనాడు తరహా పాలిటిక్స్
తాను నాలుగేళ్ల పాటు విభజన హామీలపై ఓపిక పట్టానని చంద్రబాబు చెప్పారు. కేంద్రానికి మన ఇబ్బందులు చెప్పానని, ఆవేదనలు చెప్పానని అన్నారు. తమిళనాడు తరహా రాజకీయాలు చేస్తున్నారని మోడీపై సంచలన ఆరోపణలు చేశారు.

మోడీ తమిళనాడులో రెచ్చగొట్టినట్లు
నరేంద్ర మోడీని నిలదీయాల్సిన వ్యక్తులు తనను ప్రశ్నిస్తారా అని చంద్రబాబు అన్నారు. తమిళనాడులో ఇతర పార్టీలను రెచ్చగొట్టినట్లు ఇప్పుడు తనపై ప్రధాని మోడీ.. పవన్ కళ్యాణ్‌ను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు.

హామీలు అమలు చేయట్లేదు, సాయం చేయట్లేదు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేసుల మాఫీ కోసం కేంద్రంతో రాజీపడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. తాను రాష్ట్ర ప్రయోజనాల కోసం అహర్నిషలు పాటుపడుతుంటే తనపైకి రెచ్చగొడతారా, తనను విమర్శిస్తారా అన్నారు. కేంద్రం విభజన హామీలు అమలు చేయడంలేదని, సాయం చేయడం లేదన్నారు.












Click it and Unblock the Notifications