జగన్ క్విడ్ ప్రోకో..దోపిడీ మొదలెట్టారు: చంద్రబాబు ఫైర్!

జగన్ పైన గతంలో క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారంటూ తీవ్ర ఆరోపణలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఇప్పుడు తిరిగి అవే రకమైన ఆరోపణలు ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా జగన్ పోలవరం ద్వారా దోపిడీకి శ్రీకారం చుట్టారంటూ ఆరోపించారు. పోలవరం 750కోట్లు తగ్గించామని చెప్పుకుని 7500కోట్లు నష్టం చేకూర్చారని విమర్శించారు. గతంలో ఎక్కువ కోట్‌ చేసిన సంస్థే ..ఇప్పుడు తక్కువకు కోట్‌ చేసిందని మేఘా సంస్థ పైన వ్యాఖ్యానించారు.

మెగాకు ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చేదానికి నిబంధనలు ఒప్పుకోవని సురేంద్రబాబు అడ్డుపడితే ఆయన్ని తప్పించారన్నారని విమర్శించారు. ఇసుక కొరత వల్ల 20లక్షల మంది ఇబ్బంది పడుతున్నారని వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వివాదాలమయం చేస్తున్నారన్నారు. అన్నింటిపైనా గట్టిగా పోరాడదామని పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

జగన్ క్విడ్ ప్రోకో తో దోపిడీ..

జగన్ క్విడ్ ప్రోకో తో దోపిడీ..

ముఖ్యమంత్రి జగన్ పైన ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేసారు. పోలవరం ద్వారా వైసీపీ ప్రభుత్వం దోపిడీకి శ్రీకారం చుట్టిందని విమర్శించారు. ఆరోపించారు. పార్టీ నేతలతో ఆయన టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పోలవరానికి రూ.750 కోట్లు తగ్గించామంటూ.. రూ.7500 కోట్లు నష్టం చేకూర్చారని ఆరోపించారు. గతంలో ఎక్కువ కోట్‌ చేసిన సంస్థే ..ఇప్పుడు తక్కువకు కోట్‌ చేసిందన్నారు. ఎలక్ట్రిక్‌ బస్సులు క్విడ్‌ ప్రోకోలో భాగంగానే తక్కువకు కోట్‌ చేసిందని పేర్కొన్నారు.

మెగాకు ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చేదానికి నిబంధనలు ఒప్పుకోవని సురేంద్రబాబు అడ్డుపడితే ఆయన్ని తప్పించారన్నారు. ప్రజల్ని మభ్యపెట్టి దోచుకోటానికి శ్రీకారం చుడుతున్నారంటూ ప్రభుత్వం మీద విమర్శలు చేసారు. ఏ ప్రభుత్వమూ అతి తక్కువ కాలంలో ఇంత అప్రతిష్ట పాలు కాలేదని చెప్పుకొచ్చారు.

సురేంద్రబాబును అందుకే తప్పించారు..

సురేంద్రబాబును అందుకే తప్పించారు..

ఆర్టీసి ఎండీగా ఉన్న సురేంద్రబాబును తప్పించటం వెనుక కారణాలు ఉన్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ నేతలతో టెలి కాన్ఫిరెన్స్ లో భాగంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసారు. మేఘా సంస్థకు చెందిన ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీలో ప్రవేశ పెట్టేందుకు ఆయన అడ్డుపడ్డారని వివరించారు.

ఆర్టీసి చెబుతున్న ధరకు ఆ సంస్థ బస్సులు ఇవ్వకపోవటం..వారు అడిగిన ధరకు ఎండీ సురేంద్రబాబు అనుమతి ఇవ్వకపోవటంతోనే ఆయనను అక్కడి నుండి తప్పించి సాధారణ పరిపాలనా శాఖకు బదిలీ చేసారని వార్తలు వస్తున్నాయి. ఆయన స్థానంలో రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ క్రిష్ణబాబుకు అదనపు బాధ్యతల ను అప్పగించారు. ఇక, ఇప్పుడు చంద్రబాబు సైతం అదే సమాచారన్ని ప్రస్తావించారు. పోలవరం కాంట్రాక్టు దక్కించుకున్న మేఘా సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చేదానికి నిబంధనలు ఒప్పుకోవని సురేంద్రబాబు అడ్డుపడితే ఆయన్ని తప్పించారని ఆరోపించారు.

పోరాటాలకు సిద్దం కండి..

పోరాటాలకు సిద్దం కండి..

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలు పోరాటాలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. వరద తగ్గినా బోటు తీసే ప్రయత్నం చేయటం లేదని చెప్పారు. ప్రైవేటు సంస్థ ముందుకొచ్చి తీస్తామన్నా.. వారికి అనుమతివ్వటం లేదన్నారు. ఇసుక పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. ఇసుక కొరత వల్ల 20లక్షల మంది ఇబ్బంది పడుతున్నారని వివరించారు.

తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వివాదాలమయం చేస్తున్నారన్నారు. అన్నింటిపైనా గట్టిగా పోరాడదామని సూచించారు. ఇప్పటికే భవన నిర్మాణ కార్మికులు చంద్రబాబును కలిసి తమ సమస్యలను వివరించారు. ఇదే సమయంలో ప్రభుత్వం ఇసుక పాలసీ ప్రకటించినా.. ఇసుక అందుబాటులోకి రాలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, ఇప్పుడు తమ ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణ మాఫీ నాలుగు..అయిదో విడత నిధుల విడుదలకు సంబంధించిన జీవోను రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ నేతలు తప్పు బడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+