వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీకి ఆనందం ఎందుకు : నా పిలుపుతో ఓట‌ర్లు త‌ర‌లి వ‌చ్చారు..గెలుపు ఖాయం : చ‌ంద్ర‌బాబు ధీమా..!

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలు త‌ప్ప‌ని తేల్చేసారు. వెయ్యి శాతం టీడీపీ గెలుస్తుంద‌ని చాలా ధీమాగా చెబుతున్నారు. త‌న పిలుపుతో ఓట‌ర్లు వేలాదిగా పోలింగ్ కేంద్రాల‌కు త‌ర‌లి వ‌చ్చార‌ని చెప్పుకొచ్చారు. అన్ని పార్టీలు ఈవీఎంలు కాపాడుకోవ‌టంలో బిజీగా ఉన్నాయ‌న్నారు. వైసీపీ ఎందుకు ఆనంద ప‌డుతుందో అర్దం కావ‌టం లేద‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ఎన్నిక‌ల సంఘం ప‌ని తీరు మీద మ‌రో సారి విమ‌ర్శ‌లు చేసారు.

వైసీపీకి ఆనందం ఎందుకో...
ఎన్నిక‌ల ఫ‌లితాలు రాక‌ముందే వైసీపీ మంత్రివ‌ర్గం ఏర్పాటు చేసుకుంటుంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎద్దేవా చేసారు. వైసీపీ నేత‌ల ఆనందం ఎందుకో ఆర్దం కావ‌టం లేద‌ని వ్యాఖ్యానించారు. ఎన్నిక‌లు పూర్త‌య్యాక స‌ర్వేలు చేయ‌టం స‌హ‌జ‌మ‌ని..1983 నుండి టీడీపీ కూడా స‌ర్వేలు చేస్తోంద‌ని వివ‌రించారు. నూటికి వెయ్యి శాతం టీడీపీ విజ‌యం సాధిస్తుంద‌ని..అందులో నో సెకండ్ థాట్‌..రాసిప‌పెట్టుకోండంటూ వ్యాఖ్యానించారు. ఇవిఎంలు ప‌ని చేయ‌క అనేక మంది తిరిగి ఇళ్ల‌కు వెళ్లిపోతే..తాను ఇచ్చిన పిలుపుతో తిరిగి పోలింగ్ కేంద్రాల‌కు చేరిన ఓట‌ర్లు అర్ద‌రాత్రి వ‌ర‌కు వేచి చూసి మ‌రీ ఓట్లు వేసార‌ని..ఇది త‌న మీద ఉన్న విశ్వ‌స‌నీయ‌త అని చెప్పుకొచ్చారు. అనేక ప్రాంతాల నుండి ర‌వాణా సౌక‌ర్యం లేక‌పోయినా..ఓటు వేయాల‌నే కోరిక‌తో త‌ర‌లి వచ్చి టీడీపీకి ఓటు వేసార‌ని వివ‌రించారు.

Chandra Babu confidently saying no need of second thought on TDP win..

ఎన్నిక‌ల సంఘం విఫ‌ల‌మైంది...
ఎన్నిక‌ల సంఘం త‌ప్పు మీద త‌ప్పులు చేస్తోంద‌ని..అనేక అనుమానాల‌కు తావిస్తోంద‌ని ముఖ్య‌మంత్రి వ్యాఖ్యానించారు. ఏపీలో పోలింగ్ స‌మ‌యంలో అవసరమైనప్పుడు కేంద్ర బలగాల్ని పంపమంటే కేంద్రం ప్రభుత్వం పంపలేదని, అవసరం లేనప్పుడు పంపుతున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. చివరికి ఎన్నికల కమిషన్ లోనే లుకలుకలు వచ్చాయని చంద్రబాబు ఆరోపించారు. కేంద్రంలో ఒక ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు చేశామని..అయితే, అన్ని పార్టీలు ఈవీఎంలను కాపాడుకోవడంలో బిజీగా ఉన్నాయన్నారు. ఈవీఎంలు ఎత్తుకెళ్లే అవకాశాలు చాలా తక్కువని, ఫ్రీక్వెన్సీ మార్చవచ్చునని చంద్ర‌బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. పోలింగ్ జరిగే రోజున కనీసం పోలింగ్‌ ఏజెంట్లకు భోజనం కూడా పెట్టలేదని చంద్రబాబు విమర్శించారు. సీఈసీ దగ్గరికి వెళ్లి ఏజెంట్లకు భోజనం పెట్టమని అడుక్కోవాల‌ని చెబుతున్నారా అని ప్రశ్నించారు.

English summary
TDP Chief Chandra Babu says thousand percent TDP will Win in Elections. Since 1983 TDP Conducting surveys and he know the voter pulse very well. Babu confidently saying no need of second thought surely TDP win.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X