అసంతృప్తుల పై చంద్రబాబు కొత్త ఫార్ములా - సెట్ అయ్యేనా..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఉత్కంఠగా మారుతోంది. అటు నామినేషన్లు కొనసాగుతున్న వేళ ఇటు టీడీపీలో అభ్యర్దుల మార్పు జరుగుతోంది. అయిదు నియోజకవర్గాల్లో చంద్రబాబు అభ్యర్దులను మార్పు చేసారు. అనపర్తి సీటు పైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఉండి సీటు పైన చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. అటు మడకశిరలో అభ్యర్ది మార్పు పైన ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో, చంద్రబాబు అసమ్మతి తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు.
చంద్రబాబు ఫార్ములా
టీడీపీలో అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు చంద్రబాబు కొత్త ఫార్ములా అమలు చేస్తున్నారు. సీట్లు ఆశించి భంగ పడిన నేతలకు పార్టీ పదవులు ప్రకటిస్తున్నారు. తాజాగా చంద్రబాబు అయిదు సీట్లలో మరో సారి అభ్యర్దులను మార్చారు. ఉండి నుంచి ఇప్పటికే ప్రకటించిన రామరాజును మార్చారు. అక్కడ తాజాగా పార్టీలో చేరిన రఘురామ రాజుకు సీటు కేటాయించారు. మాడుగుల టిక్కెట్ మాజీ మంత్రి బండారు సత్యానారాయణకు దక్కింది. పాడేరు లో అభ్యర్దిని మార్చి గిడ్డి ఈశ్వరికి ఖరారు చేసారు. మడకశిర స్థానంలో మార్పు చేసారు. తాజాగా టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న ఎంఎస్ రాజు ను ప్రకటించారు.

పార్టీ పదువులు
ఇక, నెల్లూరు జిల్లా వెంకటగిరి స్థానాన్ని కుమార్తె నుంచి తండ్రి కురుగొండ రామకృష్ణకు మార్పు చేస్తూచంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దెందులూరు, తంబళ్లపల్లె అభ్యర్థులకు బీ-ఫారాలు పెండింగులో పెట్టారు. అనపర్తి సీటు పైన స్పష్టత వచ్చిన తరువాతనే ఈ రెండు సీట్ల పైన తుది నిర్ణయం జరగనుంది. ఇక, ఉండి స్థానం రఘురామకు కేటాయించటంతో అక్కడ ఆగ్రహంతో ఉన్న నేతలకు చంద్రబాబు పార్టీ పదువులు ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రామారాజుకు తొలుత సీటు కేటాయించారు. కానీ, ఇప్పుడు రఘురామకు సీటు ప్రకటించటంతో రామరాజును నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

సహకారం అందేనా
అయితే, రామరాజు కు సీటు మార్పు అంశం చర్చకు వచ్చిన సమయం నుంచి ఆయన మద్దతు దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన సీటు పైన చంద్రబాబు నిర్ణయం తరువాతనే తన స్పందన ఉంటుందని రామరాజు చెబుతూ వచ్చారు. ఇప్పుడు రఘురామకు సీటు ఖరారు చేస్తూనే..రామరాజుకు పార్టీ పదవి ప్రకటించారు. రామరాజు స్పందన తెలియాల్సి ఉంది. ఇప్పటికే అక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివ రామ రాజు స్వతంత్ర అభ్యర్దిగా బరిలోకి దిగుతున్నారు. పశ్చిమ గోదావరి పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న సీతారామ లక్ష్మిని పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే సీట్లు ఆశించిన వారికి పార్టీ పదవులు ఇవ్వటంతో వారు సహకరిస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications