• search
 • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జగన్ ను ఓడించాలంటే - ఇలా నడవదన్న చంద్రబాబు : ఢీ అంటే ఢీ- వారే టీడీపీ అభ్యర్ధులు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికలకు అప్పుడే కార్యాచరణ ప్రారంభించారు. జగన్ ను ఎదుర్కోవాలంటే సాంప్రదాయ రాజకీయాలు నడవవనే అభిప్రాయనికి వచ్చారు. కొత్త స్ట్రాటజీతో ముందుకు వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పారు. అభ్యర్ధుల ఎంపికలోనూ తన వైఖరి ఏంటో స్పష్టం చేసారు. తాజాగా పార్టీ నేతలతో సమావేశమైన చంద్రబాబు చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ల పైన ఆశలు పెట్టుకున్నవారిలో టెన్షన్ పుట్టిస్తోంది.

సాంప్రదాయ రాజకీయాలు ఇక నడవవు

సాంప్రదాయ రాజకీయాలు ఇక నడవవు

పలు కార్పోరేషన్లు.. మున్సిపాల్టీలకు చెందిన పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడి పనిచేసిన వారిని.. అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు ఎమ్మెల్యేలు పట్టించుకోలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి..లేదా, తమ అడుగులకు మడుగులొత్తే వారికో నామినేటెడ్‌ పదవులు కట్టబెట్టారని చెప్పుకొచ్చారు. పార్టీ అధికారం కోల్పోగానే వారంతా ప్రత్యర్థులకు దగ్గరయ్యారంటూ వివరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేసిన వారే మళ్లీ మిగిలారంటూ చంద్రబాబు పేర్కొన్నారు.

జగన్ పార్టీతో ఢీ అంటే ఢీ

జగన్ పార్టీతో ఢీ అంటే ఢీ

కింది స్థాయిలో జరుగుతున్న తప్పు మీకు తెలిస్తే కార్యకర్తలను, కింది స్థాయి నాయకుల ను మన్నించమని అడగండి.. తప్పులేదు అంటూ పార్టీ నేతలకు సూచించారు. తమ ఎన్నికలు కాదని కొందరు నాయకులు స్థానిక ఎన్నికలను నిర్లక్ష్యం చేయడంతో నష్టం జరిగిందని, సీరియ్‌సగా తీసుకున్న చోట గట్టి పోటీ ఇచ్చి కొన్ని చోట్ల విజయం సాధించామని విశ్లేషించారు. ఏ ఎన్నిక జరిగినా ప్రతి సీట్లో పోటీ జరగాల్సిందేనని.. ఎక్కడైనా అభ్యర్థులను దిం చలేకపోతే ఆ వైఫల్యం అక్కడి ముఖ్య నేతలదే అవుతుందని తేల్చి చెప్పారు.

సత్తా ఉన్నవారే పార్టీ అభ్యర్దులు

సత్తా ఉన్నవారే పార్టీ అభ్యర్దులు

టీడీపీ ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదు వంటి అక్రమాలు పెద్దఎత్తున జరుగుతున్నాయని తన దృష్టికి వచ్చిందని, ఓటర్ల జాబితాలు సరిచూసుకుని అప్పీలుకు వెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. ఇక నుంచి సంప్రదాయ రాజకీయాలు నడవవని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఢీ అంటే ఢీ అనే అభ్యర్ధుల్ని మాత్రమే రంగంలో దించుతామని వారే పార్టీ అభ్యర్ధులుగా పోటీ చేస్తారని స్పష్టం చేసారు. నేషన్లు విఫలమైనా, ఓటమి పాలైనా ముఖ్యనేతలదే బాధ్యత చేస్తామని స్పష్టం చేసారు. 2024 ఎన్నికల సన్నాహకంలో భాగంగా ఇప్పటికే చంద్రబాబు పలు నియోజవకర్గాలకు ఇన్ ఛార్జ్ లను నియమించారు.

ప్రజా సమస్యలపైనే ఒక ఫోకస్

ప్రజా సమస్యలపైనే ఒక ఫోకస్

పార్టీ సమన్వయం పైన ఫోకస్ పెట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో తన సొంత నియోజవకర్గం కుప్పంలో ఓడిన తరువాత చంద్రబాబు తన కార్యాచరణ వేగవంతం చేసారు. ఈ వారంలో మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. అయితే, కరోనా కేసుల కారణంగా ప్రతీ ఏటా సంక్రాంతికి కుప్పం వెళ్లే చంద్రబాబు ఈ సారి వెళ్లకూడదని డిసైడ్ అయ్యారు. అయితే, కుప్పం పొలిటికల్ టూర్ మాత్రం ఉంటుందని చెబుతున్నారు.

  2021 Year Ender: Telugu States లో వీళ్ళు మస్త్ ఫేమస్ గురూ | Top Names | Oneindia Telugu
  ప్రతీ నియోజకవర్గంపైనా తానే సొంతంగా

  ప్రతీ నియోజకవర్గంపైనా తానే సొంతంగా


  ఇక నుంచి ప్రజా సమస్యల పైన ఎక్కువగా ప్రజల్లోనే ఉంటూ.. పోరాటాలు చేయాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా.. నిత్యావసరాల ధరల వంటి అంశాల పైన నిరసనలకు నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీని ఓడించాలంటే ఢీ అంటే ఢీ అనే వారే అభ్యర్ధులుగా ఉంటారని చెప్పటం ద్వారా.. ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో ఆ స్థాయిలో వైసీపీకి ధీటుగా పోరాటం చేసే నేతలను ఎన్నికల నాటికి సిద్దం చేయాలనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది.

  English summary
  TDP Chief Chandra Babu implemeting new strategy to face CM Jagan in coming elections, Babu suggested party leaders to foucs on local issues
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X