వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎంకు విశ్వసనీయత ఉంటే - ఈడీ విచారణ జరపాలి : చంద్రబాబు..!!

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. అప్పుల విషయంలో ప్రభుత్వం సమాధానం పెద్ద బూటకమన్న చంద్రబాబు.., విశ్వసనీయత ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసారు. పోలవరం నిర్మాణానికి సంబంధించి కేంద్రంతో పాటుగా పీపీఏ..నిపుణు కమిటీ రాష్ట్ర ప్రభుత్వ తప్పు ఉందని తేల్చి చెప్పిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ప్రభుత్వాన్ని తప్పు బట్టటంతో ఇప్పుడు సీఎం ఏం సమాధానం చెబుతారని ముఖ్యమంత్రిని నిలదీసారు. పార్టీకి చెందిన ముఖ్య నేతలతో చంద్రబాబు వ్యూహ కమిటీ సమావేశం నిర్వహించారు.

 ప్రభుత్వం వినిపించుకోలేదు

ప్రభుత్వం వినిపించుకోలేదు


కాంట్రాక్టర్ ను మార్చవద్దని పోలవరం అథారిటీతో పాటుగా ఇరిగేషన్ శాఖ చెప్పినా వైసీపీ ప్రభుత్వం వినిపించుకోలేదని చంద్రబాబు దుయ్యబట్టారు. పోలవరం పరిహారంపై నాటి హామీలు ఏమయ్యాయని చంద్రబాబు నిలదీసారు. కాంట్రాక్టర్ ను మార్చవద్దంటూ పోలవరం అథారిటీ.. కేంద్ర జలశక్తి లేఖ రాసినా..హెచ్చరికలు చేసినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. గోదావరి వరద బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చంద్రబాబు ఆరోపించారు.

నాడు లేని ఇబ్బందులు నేడు ఎందుకు

నాడు లేని ఇబ్బందులు నేడు ఎందుకు


2014లో విలీనం తరువాత ఎటువంటి ఇబ్బందులు లేని విలీన గ్రామాల ప్రజలు..ఇప్పుడు తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. వారి నిరసనలకు ప్రభుత్వ వైఖరి కారణమన్నారు. ప్రభుత్వం నిర్మిస్తోందిన కాలనీలు కాదని..జలగన్న కాలనీలంటూ దుయ్యబట్టారు. పాఠశాలల విలీనం పేరుతో బడుటు మూసేస్తున్నారని..బార్లు మాత్రం కావాల్సిన సంఖ్యలో తెరుస్తున్నారని ఎద్దేవా చేసారు. విద్యార్ధులకు పాఠపుస్తకాల పంపిణీ విషయంలోనూ విద్యాశాఖ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఈడీ విచారణ చేయాలంటూ

ఈడీ విచారణ చేయాలంటూ


రాష్ట్రంలో మొత్తంగా 1.42 కోట్ల రేషన్ లబ్దిదారులు ఉన్నారని..వారికి బియ్యం పంపిణీ చేయలంటూ చంద్రబాబు డిమాండ్ చేసారు. అదాన్ డిస్టలరీకి రెండేళ్లలోనే రూ.2,400 కోట్ల విలువైన ఆర్డర్లు ఏ విధంగా ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై ఈడీ విచారణ జరపాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. అంతకు ముందు మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి నాటి చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలే కారణమంటూ ఆరోపించారు.

English summary
TDP Chief Chandra Babu demaded ED probe on oreders for Adan Distallery value of rs 2,400 cr, fires on CM JAgan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X