పోలింగ్ ఓ నిశ్శ‌బ్ద విప్ల‌వం : జ‌గ‌న్ గొప్ప‌త‌నం ఏంటి..నా ఓటు నాకు ప‌డిందా : ఇసి పై బాబు నిప్పులు..!

ఏపిలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ పై టిడిపి అధినేత చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. అస‌లు ఎన్నిక‌ల సంఘం ప్ర‌జాస్వామ్యా న్ని ర‌క్షిస్తుందా..లేక నేర‌స్థుల‌కు కొమ్ము కాస్తుందా అని ప్ర‌శ్నించారు. ఎన్నిక‌ల సంఘం తీరు పై రేపు ఢిల్లీ వెళ్తున్నాన‌ని వ‌ద‌లిపెట్టే ప్ర‌సక్తే లేద‌ని తేల్చి చెప్పారు. అస‌వ‌ర‌మైతే అక్క‌డ ధ‌ర్నా చేస్తామ‌ని హెచ్చ‌రించారు. ఇక‌, ఏపిలో పోలింగ్ స‌ర‌ళి ఓ నిశ్వ‌బ్ద విప్లవం సృష్టిస్తుంద‌ని..అది ఎవ‌రికీ అర్దం కాద‌న్నారు. జ‌గ‌న్ కు ఎందుకు ఓటు వేస్తారు..ఆయ‌న గొప్ప త‌నం ఏంటని ప్ర‌శ్నించారు. సీయ‌స్ ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం ను కోవ‌ర్టుగా చంద్ర‌బాబు అభివ‌ర్ణించారు.

 ఎన్నిక‌ల సంఘం పై చంద్ర నిప్పులు..

ఎన్నిక‌ల సంఘం పై చంద్ర నిప్పులు..

ఎన్నిక‌ల సంఘం పై టిడిపి అధినేత తీవ్ర స్థాయి లో మండి ప‌డ్డారు. ఏపిలో ఎప్పుడూ లేని విధంగా విధ్వంసాలు జ‌రి గాయ‌ని..ఎన్నిక‌ల సంఘం ప్రేక్ష‌క పాత్ర పోషించింద‌ని వివ‌రించారు. ఇష్టానుసారం అధికారుల‌ను మార్చి..వైసిపికి స‌హ‌క‌రించార‌ని ఆరోపించారు. ఒక్కో చోట మూడు నాలుగు సార్లు తిరిగితే కానీ ఓటు వేసే అవ‌కాశం రాలేద‌న్నారు. అర్ద రాత్రి వ‌రకు ఓట‌ర్ల‌ను పోలింగ్ కోసం నిరీక్షించాల్సి వ‌చ్చింద‌న్నారు. ఎన్నిక‌ల సీఈవో ఓటు వేయ‌లేని ప‌రిస్థితిలో ఉంటే ఎన్నిక‌ల సంఘం ఏం స‌మాధానం చెబుతుంద‌ని ప్ర‌శ్నించారు. ఇవియం ల రిపేర్ కోసం ఎవ‌రిని ప‌డితే వారిని వినియోగించార‌ని వారి పై ఎవ‌రికి న‌మ్మ‌కం ఉంటుంద‌ని నిల‌దీసారు. రేపు ఢిల్లీ వెళ్తాన‌ని ఎన్నిక‌ల సంఘాన్ని నిల‌దీస్తా న‌ని స్ప‌ష్టం చేసారు. మంత్రులు..ఎంపీల‌తో క‌లిసి వెళ్తున్నామ‌ని..అవ‌స‌ర‌మైతే అక్క‌డ ధ‌ర్నా చేస్తామ‌ని హెచ్చ‌రించా రు. ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ కోసం ఏ స్థాయి కైనా వెళ్తామ‌ని స్ప‌ష్టం చేసారు.

నా ఓటు నాకు ప‌డింద‌నే న‌మ్మకం లేదు..

నా ఓటు నాకు ప‌డింద‌నే న‌మ్మకం లేదు..

నా ఓటు నాకు ప‌డింద‌నే న‌మ్మ‌కం లేద‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. చిప్ ఆధారిత ఇవియంల్లో ఏదైనా చేసే అవ‌కా శం ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు. తెలంగాణ లో 25 లక్ష‌ల ఓట్లు తొలిగించి సారీ చెప్పార‌న్నారు.ఇంట‌లిజెన్స్ అధికారు లె ఎక్క‌డ స‌ర్వే చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. వైసిపి చెప్పిన నేత‌ల‌ను బ‌దిలీ చేసార‌ని చెప్పుకొచ్చారు. ఇవియం లు ఆ స్థాయిలో ఇబ్బంది పెడితే వైసిపి ఎందుకు ప్ర‌శ్నించ‌లేద‌ని నిల‌దీసారు. పైగా ఇసిని అభినందించింద‌న్నారు. వివి ప్యాట్స్ ప‌ని చేయ‌లేద‌ని..అర్ద‌రాత్రి వ‌ర‌కు ఓటు కోసం నిరీక్షించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డానికి కార‌ణం ఎవ‌రో చెప్పాల‌ని డిమాండ్ చేసారు. వివి ప్యాట్స్ గురించి సుప్రీం ఇచ్చిన తీర్పు పై రివ్యూ కు వెళ్తున్నామ‌ని చెప్పారు.

సీయ‌స్ ఎల్వీ పై సీయం తీవ్ర వ్యాఖ్య‌లు..

సీయ‌స్ ఎల్వీ పై సీయం తీవ్ర వ్యాఖ్య‌లు..

ఎన్నిక‌ల సంఘం నియ‌మించిన రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం పై చంద్ర‌బాబు తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. జ‌గ‌న్ కు స‌హ నిందితుడుగా ఉన్న వ్య‌క్తిని సీయ‌స్ గా నియ‌మించార‌న్నారు. కోవ‌ర్టు గా ప‌ని చేసే వ్య‌క్తిని సీ య‌స్ గా నియ‌మిస్తే..మేము ఆయ‌న‌తో ప‌ని చేయించుకోవాలా అని ప్ర‌శ్నించారు. ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యం లో సీయ‌స్ నేరుగా డిజిపి కార్యాల‌యానికి ఎందుకు వెళ్లార‌ని నిల‌దీసారు. ఇక‌, ఎన్నిక‌ల సీఈవో మీద ఆగ్ర‌హం వ్య‌క్తం చేసా రు. నిస్స‌హాయ‌త వ్య‌క్త చేయ‌టం కంటే..బాధ్య‌త‌ల నుండి త‌ప్పుకోవచ్చు క‌దా అని వ్యాఖ్యానించారు.

పెద్ద వేవ్ ఉండి..ఆది నిశ్వ‌బ్ద విప్ల‌వం..

పెద్ద వేవ్ ఉండి..ఆది నిశ్వ‌బ్ద విప్ల‌వం..

ఇక‌, పోలింగ్ గురించి చంద్ర‌బాబు ఆస‌క్తి క‌ర వ్యాఖ్య‌లు చేసారు. పోలింగ్ లో మ‌హిళ‌లు..వృద్దులు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చార‌ని..అది మీ ఊహ‌కు అంద‌ని వేవ్ అని చంద్ర‌బాబు పేర్కొన్నారు. హైద‌రాబాద్, చెన్నై, బెంగుళూరు నుండి భ‌వి ష్య‌త్ కోసం ఓటు వేయటానికి వ‌చ్చార‌న్నారు. ఆ వేవ్ జ‌గ‌న్ కు ఎందుకు ఉంటుంద‌ని ప్ర‌శ్నించారు. చాలా బ‌ల‌మైన వేవ్ క‌నిపించింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. జ‌గ‌న్ గొప్ప‌త‌నం ఏముంద‌ని..ఎందుకు ఓట్లు వేస్తార‌ని బాబు ప్ర‌శ్నిస్తున్నారు.
వారి అరాచ‌కాలు త‌ట్టుకోలేక‌నే విశాఖ‌లో విజ‌య‌మ్మ‌ను ఓడించార‌న్నారు. ప్ర‌జ‌లు విజ‌యం అందించార‌ని.. అయితే మ్యానిపులేట్ చేయ‌టానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతాయ‌ని అనుమానం వ్య‌క్తంచేసారు. ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడ‌టానికి వ‌చ్చిన ప్ర‌తీ ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+