ఆపరేషన్ గరుడ సృష్టికర్త చంద్రబాబే...పవన్‌పై కూడా దాడికి కుట్ర:కన్నా సంచలన ఆరోపణలు
గుంటూరు:ఆత్మహత్య చేసుకునే వ్యక్తి సూసైడ్ నోట్ రాసుకోవడం చూశాం గానీ...హత్య చేసే వ్యక్తి లేఖ రాయడం టీడీపీ ప్రభుత్వంలోనే చూస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. జగన్ పై దాడి గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు.
గుంటూరులో కన్నా మీడియాతో మాట్లాడుతూ...అసలు ఆపరేషన్ గరుడ సృష్టికర్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఆరోపించారు. ఓ సినిమా యాక్టర్ చెప్పిన వాటిని చదివే స్థాయికి ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజారిపోయారని కన్నా ఆరోపించారు. ఆ సినిమా నటుడిని తక్షణమే అరెస్ట్ చేసి కుట్రలు బయటపెట్టాలని కన్నా డిమాండ్ చేశారు. సినిమా నటుడు చదివిన స్క్రిప్ట్ అంతా సీఎం చంద్రబాబు రాసిందేనని కన్నా ఆరోపించారు.

చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని కన్నా విమర్శించారు. గతంలో ఏడాది సర్వీస్ ఉన్న ప్రసాద్‌రావుని తప్పించి...చంద్రబాబు తన బంధువును డీజీపీగా పెట్టుకున్నారని కన్నా చెప్పారు. అయితే ప్రదాని మోడీ...చంద్రబాబులా సీబీఐలో తన బంధువును పెట్టుకోలేదని వ్యాఖ్యానించారు.
అలిపిరిలో దాడి జరిగినప్పుడు చంద్రబాబు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎందుకు ఫిర్యాదు చేయలేదని కన్నా ప్రశ్నించారు. రాష్ట్రంలో అసమర్థ పాలన జరుగుతుంటే గవర్నర్ జోక్యం చేసుకోవడంలో తప్పేమీ లేదని కన్నా వ్యాఖ్యానించారు. ఆత్మహత్య చేసుకునే వ్యక్తి సూసైడ్ నోట్ రాసుకోవడం చూశాం గానీ...హత్య చేసే వ్యక్తి లేఖ రాయడం టీడీపీ ప్రభుత్వంలోనే చూస్తున్నామని కన్నా ఎద్దేవా చేశారు.
జగన్‌పై జరిగిన దాడిని అందరూ ఖండించారని...మానవ జన్మ ఎత్తిన వారు ఎవరైనా అలాగే ఖండిస్తారని అన్నారు. ప్రతిపక్ష నేత రాష్ట్రంలో ప్రశాంతంగా తిరిగే పరిస్థితి లేదన్నారు. అమిత్ షాపై దాడి చేశారు. అలాగే తనపై కూడా దాడి చేశారన్నారు. పవన్‌కల్యాణ్‌పై కూడా దాడికి కుట్రలు చేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా ఆరోపించారు.
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications