నిలుపుదల చేయండి - చంద్రబాబు లేఖ..!!
ఏపీలో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. పోలింగ్ తరువాత గెలుపు పైన రెండు ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సర్వే సంస్థలు పోస్ట్ పోల్ సర్వేలు కొనసాగిస్తున్నాయి. జూన్ 1న ఎగ్జిట్ పోల్.. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పటికే జగన్ తాము 2019 లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువ గెలుస్తామని చెప్పుకొచ్చారు. టీడీపీ నుంచి అదే స్థాయిలో ధీమా కనిపిస్తోంది. ఈ సమయంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు యూపీపీఎస్సీ ఛైర్మన్ కు లేఖ రాసారు.
విదేశీ పర్యటనలో ఉన్నచంద్రబాబు రాష్ట్రంలో పరిణామాల పైన సమాచారం సేకరిస్తున్నారు. తాజాగా..యూపీపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీకు చంద్రబాబు లేఖ రాశారు. ఐఏఎస్‌కు రాష్ట్ర కేడర్ ఆఫీసర్ల ఎంపిక కార్యక్రమాన్ని మోడల్ కోడ్ ఉన్నప్పుడు చేయడం సముచితం కాదని చెప్పారు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకు నియమించొద్దని యూపీఎస్సీని చంద్రబాబు కోరారు. వారి ప్రమోషన్స్ ముఖ్యమంత్రి కార్యాలయంలోని వారికే పరిమితం చేశారన్నారు. ఇప్పుడు కూడా జాబితా తయారీలో పారదర్శకత లేదని అన్నారు.ఈ అంశాన్ని పునః పరిశీలించాలని యూపీపీఎస్సీ చైర్మన్‌ను చంద్రబాబు కోరారు.

ఎన్నికలు అయిపోయన తర్వాత వైద్య పరీక్షల కోసం చంద్రబాబు అమెరికా వెళ్లారు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తుంటే.. ఆయనకు ఎదురెల్లి టీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావును చంద్రబాబు ఫోన్ లో పరామర్శించారు. అతనిపై పిన్నెల్లి, అతని అనుచరులు గొడ్డళ్లతో తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు.ఫోన్ లో చంద్రబాబు ధైర్యం చెప్పారు. చంద్రబాబు తన విదేశీ పర్యటనను ముగించుకొని నాలుగైదు రోజుల్లో ఏపీకి వస్తారని సమాచారం. ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై పార్టీ కేడర్‌తో చంద్రబాబు సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications