టిడిపిలోకి రఘురామ - చంద్రబాబు తాజా ఆఫర్, సీటు ఖరారు..!?
ఏపీలో ఎన్నికలవేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైసిపి రెబల్ ఎంపీ రఘురామకు బిజెపి టికెట్ నిరాకరించింది. దీంతో ఇప్పుడు ఆయన టిడిపిలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. టిడిపి నుంచి ఎంపీ సీటు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా.. ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.
Recommended Video

అభ్యర్థుల ఖరారు
పొత్తులో భాగంగా బిజెపి ఏపీ నుంచి ఆరు ఎంపీ స్థానాలకు తమ అభ్యర్థులను ఖరారు అభ్యర్థుల చేసింది. పొత్తులో విజయనగరం సీటు బిజెపికి కేటాయించగా, తర్వాత జరిగిన చర్చల్లో బిజెపి రాజంపేట తీసుకుంది. విజయనగరం టిడిపికి దక్కింది. రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు టిడిపి విజయనగరం నుంచి తమ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. అయితే వైసిపి రెబల్ ఎంపీగా జగన్ పై నిత్యం పోరాటం చేసిన రఘురామరాజు బిజెపి నుంచి పోటీకి సిద్ధమయ్యారు. కానీ, బిజెపి ఆయనకు సీటు నిరాకరించింది. ముఖ్యమంత్రి జగన్ కారణంగానే తనకు సీటు రాలేదని రఘురామ ఆరోపించారు. జగన్తో విభేదిస్తూ తొలినుంచి చంద్రబాబుకు సహకరించిన రఘురామకు ఇప్పుడు టిడిపి నుంచి సీటు ఇవ్వబోతున్నారని చర్చ మొదలైంది. రఘురామ ఈరోజు చంద్రబాబును కలిసి అవకాశం ఉందని సమాచారం. నరసాపురంలో బిజెపి నుంచి శ్రీనివాస వర్మ పార్టీ తమ అభ్యర్థిగా ఖరారు చేసింది.

విజయనగరం నుంచి బరిలోకి
విజయనగరం రఘురామ ను బరిలోకి దింపే అంశంపై చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. విజయనగరం నుంచి వైసీపీ తరఫున తిరిగి బెల్లాన చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు విజయనగరం నుంచి గతంలో ఎంపీగా గెలిచి ఉన్నారు. క్షత్రియ సామాజిక ఓటర్లు విజయనగరం పరిధిలో ఉన్నారు. దీంతో రఘురామరాజుకు టిడిపి నుంచి విజయనగరం సీటు ఇస్తారని ప్రచారం మొదలైంది. తొలుత విజయనగరం నుంచి ఏపీ టిడిపి మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పేరు పరిశీలనలో ఉంది. ఆయన సొంత నియోజకవర్గ ఎచ్చెర్ల అసెంబ్లీ బిజెపికి కేటాయించారు. దీంతో కల వెంకట్రావు పార్లమెంటుకు పోటీ చేయాలని ఇప్పటికే చంద్రబాబు సూచించారు. కానీ కళా వెంకట్రావు అందుకు సిద్ధంగా లేరు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తెకు విజయనగరం అసెంబ్లీ సీటు ప్రకటించారు. అశోక్ గజపతిరాజు ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు. ఈ సమయంలో రఘురామరాజును విజయనగరం నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనేది చర్చ జరుగుతుంది.
చంద్రబాబు నిర్ణయం
అయితే, పొత్తులో భాగంగా బిజెపి సీటు నిరాకరించిన రఘురామకు అవకాశం కల్పిస్తే నేతలు ఎలా స్పందిస్తారనేది ఇక్కడ కీలక అంశంగా మారుతుంది. దీనికి సంబంధించి బిజెపి నేతలతో చర్చించిన తర్వాతనే చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుని అవకాశం ఉంది. రఘురామ పార్టీలో చేరలేదని, పార్టీ నేతలను కాదని రఘురామకు ఇవ్వటం సరికాదని పార్టీ నేతలే అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. దీంతో టీడీపీలో చేర్చుకొని విజయనగరం సీటు ఇవ్వడం పైన చంద్రబాబు తది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈరోజు లేదా రేపు ఈ సీటు పైన చంద్రబాబు తన నిర్ణయం ప్రకటిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో, రఘురామ ప్రచారం జరుగుతున్నట్లుగా టిడిపి నుంచి పోటీ చేస్తారా లేక ఈ ఎన్నికల్లో దూరంగానే ఉంటారా అనేది ఆసక్తికరంగా మారుతుంది.












Click it and Unblock the Notifications