ఏపీ నూతన అసెంబ్లీ స్పీకర్ ఖరారు..!?
ఏపీలో ఎన్డీఏ కూటమి పాలన మొదలైంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు..ఉప ముఖ్యమంత్రిగా పవన్ ఎన్నికల హామీలు అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. మంత్రివర్గం కూర్పులో ఈ సారి చంద్రబాబు గతం కంటే భిన్నంగా వ్యవహరించారు. పలువురు సీనియర్లను పక్కన పెట్టారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్పు చేసారు. ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ ఎంపిక పైన కసరత్తు ప్రారంభించారు. ఇద్దరి పేర్లు కొత్త స్పీకర్ గా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
చంద్రబాబు కసరత్తు
ఏపీ శాసనసభా కొత్త స్పీకర్ ఎంపిక పైన చంద్రబాబు తన నిర్ణయం ప్రకటించనున్నారు. అసెంబ్లీలో టీడీపీ కూటమి ఏకపక్షంగా సీట్లు సాధించింది. టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 సీట్లు గెలవగా.. వైసీపీ 11 సీట్లకే పరిమితం అయింది. ప్రతిపక్షం బలహీనంగా ఉండటంతో చంద్రబాబు ఎవరికి స్పీకర్ పదవి ఇస్తారనే చర్చ మొదలైంది. మంత్రివర్గంలో గతంలో అవకాశం రాని కొందరు సీనియర్లకు ప్రాధాన్యత ఇచ్చారు. అదే విధంగా కొత్త వారికి అవకాశం కల్పించారు. ఇక, శాఖల కూర్పులోనూ చంద్రబాబు ఆచితూచి వ్యవహరించారు.

సమీకరణాలే కీలకం
కూటమి ప్రభుత్వం కావటంతో..సమిష్టిగానే నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు -పవన్ ప్రకటించారు. స్పీకర్ పదవి కోసం జనసేన, బీజేపీ నుంచి ఎవరూ ఆశావాహులు లేరు. దీంతో..మంత్రి పదవి దక్కని సీనియర్లకు స్పీకర్ పదవి ఇస్తారనే చర్చ సాగుతోంది. మంత్రివర్గంలో క్షత్రియ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం దక్కలేదు. కూటమి అధికారంలోకి వస్తే రఘురామ రాజుకు స్పీకర్ పదవి ఇస్తారనే ప్రచారం సాగింది. రఘురామ తొలి సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. దీంతో..ఆయనకు ఇవ్వటం సందేహంగానే కనిపిస్తోంది.
ఛాన్స్ దక్కేదెవరికి
పార్టీ సీనియర్లలో చింతకాయల అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ్ల నరేంద్ర పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే, ఆర్దిక శాఖ ఇచ్చిన సామాజిక వర్గానికే స్పీకర్ పదవి ఇవ్వరనే వాదన ఉంది. దీంతో..ఉత్తరాంధ్ర నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడుకు స్పీకర్ గా ఖరారు చేస్తారని పార్టీ ముఖ్య నేతల అంచనా. డిప్యూటీ స్పీకర్ గా రఘురామ రాజు లేదా, లోకం మాధవిలో ఒకరికి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లోనే స్పీకర్ ఎంపిక పైన చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications