టీడీపీ,జనసేన తొలి జాబితా సిద్దం - సంక్రాంతికి విడుదల, లిస్టులో..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. సీఎం జగన్ వైసీపీ అభ్యర్దుల కసరత్తు తుది దశకు చేరింది. గెలుపే ప్రామాణికంగా, సామాజిక సమీకరణాలే కీలకంగా జగన్ అభ్యర్దులను ఎంపిక చేస్తున్నారు. జగన్ ఓటమి లక్ష్యంగా పొత్తుతో బరిలోకి దిగుతున్న టీడీపీ, జనసేన తొలి జాబితా విడుదలకు నిర్ణయించాయి. బీజేపీతో పొత్తు పైన స్పష్టత రాకపోయినా..వైసీపీ నుంచి ఎన్నికల అడుగులు వేగంగా పడుతున్న వేళ తాము ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యాయి.
ఉమ్మడి అభ్యర్దుల ప్రకటన : వైసీపీలో అభ్యర్దుల ఖరారు అవుతున్న వేళ తాము వేగంగా స్పందించాలని చంద్రబాబు, పవన్ నిర్ణయించారు. రెండు పార్టీల మధ్య సీట్ల ఒప్పందం పైన సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చారు. జనసేనకు 20-25 సీట్లు ఇస్తామని టీడీపీ ప్రతిపాదించగా, 40 సీట్ల వరకు దక్కించుకోవాలని పపన్ ప్రయత్నిస్తున్నారు. ముందుగా రెండు పార్టీల నుంచి సీట్లు ఖాయమైన అభ్యర్దులతో సంక్రాంతి రోజున తొలి జాబితా విడుదల చేయాలని చంద్రబాబు, పవన్ నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా.. ఇప్పటికే సిట్టింగ్ లకు తిరిగి సీట్లు ఖాయమని చంద్రబాబు హామీ ఇచ్చారు. అటు జనసేన నుంచి సీనియర్లకు తొలి జాబితాలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మరోసారి మార్పు అవసరం లేని నియోజకవర్గాల అభ్యర్దులను తొలి జాబితాలో ప్రకటించేందుకు సిద్దమయ్యారు.

తొలి జాబితా సిద్దం : తొలి జాబితాతో కుప్పం- చంద్రబాబు, మంగళగిరి -లోకేశ్, టెక్కలి - అచ్చెన్నాయుడు, కనిగిరికి ఉగ్ర నరసింహారెడ్డి, తిరువూరుకు శ్యావల దేవదత్, ఆచంటకు పితాని సత్యనారాయణ, ఆళ్లగడ్డకు భూమా అఖిలప్రియ, బొబ్బిలికి బేబి నాయన, తునికి యనమల దివ్య, వెంకటగిరిలో కురుగుండ్ల రామకృష్ణ, గుడివాడ- వెనిగళ్ల రాము, గంగాధర నెల్లూరుకు డాక్టర్ థామస్ పేర్లు ఇప్పటికే ఖరారయ్యాయి.కమలాపురం -పుత్తా నరసింహారెడ్డి, అరకు- దన్ను దొర, మండపేట- వేగుళ్ల జోగేశ్వరరావు, పీలేరు- నల్లారి కిశోర్ కుమార్‌రెడ్డి, ఉరవకొండ- పయ్యావుల కేశవ్, కోవూరు- పోలంరెడ్డి దినేశ్ రెడ్డి, పత్తికొండ- కేఈ శ్యాంబాబు, గోపాలపురం - మద్దిపాటి వెంకటరాజు, పొన్నూరు- ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, మాడుగుల - పీవీజీ కుమార్, ఉంగుటూరు - గన్ని వీరాంజనేయులు పేర్లు తొలి జాబితాలో ఉండే అవకాశం ఉంది.

ఎవరెక్కడ : ఇక, జనసేన నుంచి 10 మంది వరకు తొలి జాబితాలో ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయటం ఖాయమని చెబుతున్నారు. తెనాలి - నాదెండ్ల మనోహర్, తణుకు -విడవడ రామచంద్రరావు, తాడేపల్లిగూడెం -బొల్లి శెట్టి శ్రీనివాస్ , నరసాపురం - బొమ్మిడి నాయకర్, కాకినాడ రూరల్ - పంతం నానాజీ , పిఠాపురం - ఉదయ శ్రీనివాస్. రామచంద్రాపురం -చిక్కం దొరబాబు, గజపతిపురం - పడాల అరుణ , గాజువాక -సుందరపు సతీష్, భీమిలి - పంచకర్ల సందీప్ లేదా పెందుర్తి -పంచకర్ల రమేష్ బాబు, ఎలమంచిలి -సుందరపు విజయ్ కుమార్, ముమ్మిడివరం -పీతాని బాలకృష్ణ పేర్లు ఖరారయినట్లు విశ్వసనీయ సమాచారం. చివరి నిమిషంలో మార్పులు చేర్పులు జరిగితే మినహా ఈ జాబితాను ఇరు పార్టీల అధ్యక్షులు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications