వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్‌‌కు కలిసొస్తుందా: కాంగ్రెస్‌కు జై కొట్టి చంద్రబాబు జనసేన నెత్తిన పాలుపోశారా..?

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలవడంపై అప్పుడే ఇటు కాంగ్రెస్ అటు తెలుగుదేశం పార్టీల్లో లుకలుకలు మొదలయ్యాయి. టీడీపీతో కాంగ్రెస్ కలవడాన్ని తను ఎంతమాత్రం జీర్ణించుకోలేనని చెబుతూ ఏపీ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇక దేశాన్ని బీజేపీ నుంచి కాపాడి తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే కాంగ్రెస్‌‌తో కలిసి వెళుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఇక చంద్రబాబు ప్రకటనతో తెలుగు రాష్ట్రాల్లో ఇటు విపక్షాలు అటు సొంత పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఈ అడుగు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ నెత్తిన పాలు పోసినట్లవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం టీడీపీ సీట్లను త్యాగం చేస్తుందా..?

2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం టీడీపీ సీట్లను త్యాగం చేస్తుందా..?

2014 ఎన్నికల సమయంలో రాష్ట్రం సోనియాగాంధీ విడగొట్టారని చెబుతూ ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన చంద్రబాబు ఇప్పుడెలా కాంగ్రెస్‌తో కలుస్తారని చాలామంది టీడీపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రజల్లో చులకన అవుతామని వారు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కొత్త కలయికతో 2019 ఎన్నికలు ఏపీలో ఆసక్తికరంగా మారనున్నాయి. ఒకవేళ పొత్తుతో కాంగ్రెస్ టీడీపీలు వెళితే ఎవరెన్ని స్థానాల్లో పోటీచేస్తారనేది చాలా ఆసక్తికరంగా మారింది. రెండు పార్టీలు సమానంగా పోటీచేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది... ఇందుకు చంద్రబాబు ఒప్పుకుంటారా.. కాంగ్రెస్ నేతలు ఒప్పుకుంటారా.. అనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.


ఇన్నేళ్లు పోరాటం అంతా కాంగ్రెస్ పార్టీపై చేసిన తమకు ఒక్కసారిగా వారితో కలిసి ఇమడటం అంటే చాలా కష్టంగా ఉంటుందని టీడీపీ నేతలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే తయారైంది. ఇప్పుడు తమ భవిష్యత్తు చూసుకోకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ నేత వట్టి వసంత కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 1983 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ టీడీపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే... కాంగ్రెస్ పార్టీ టీడీపీతో చేతులు కలపడంపై తీవ్ర మనస్తాపం చెందినట్లు సమాచారం.

రాహుల్ గాంధీ-చంద్రబాబు కలయిక, కాంగ్రెస్‌కు ఏపీలో భారీ షాక్, వట్టి వసంత్ రాజీనామా రాహుల్ గాంధీ-చంద్రబాబు కలయిక, కాంగ్రెస్‌కు ఏపీలో భారీ షాక్, వట్టి వసంత్ రాజీనామా

Recommended Video

Telangana Elections 2018 : రాహుల్ ఇంటికి చంద్రబాబు
కాంగ్రెస్-టీడీపీ కలయిక పవన్ కళ్యాణ్‌కు కలిసొస్తుందా..?

కాంగ్రెస్-టీడీపీ కలయిక పవన్ కళ్యాణ్‌కు కలిసొస్తుందా..?


నాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఇక రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు అదే కాంగ్రెస్‌తో కలిసి జతకట్టడాన్ని చారిత్రాత్మక తప్పుగా చూస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అదే సమయంలో చంద్రబాబు తప్పిదం జనసేన అధినేత పవన్ ‌కళ్యాణ్‌కు కలిసొచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాదు దీన్ని పవన్ కళ్యాణ్ ఏమేరకు క్యాష్ చేసుకుంటారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇక కాంగ్రెస్‌తో చంద్రబాబు కలవడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకున్నారు. అయితే వైసీపీలోకి వెళ్లే ఛాన్స్ లేదు కాబట్టి జనసేన వైపు నేతలు చూస్తున్నట్లు సమాచారం. ఇదే కనుక జరిగితే వార్ వైసీపీ వర్సెస్ జనసేనగా మారుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెబుతున్నారు పొలిటికల్ అనలిస్టులు.

కూటమితో పవన్ కళ్యాణ్‌ను బాబు డిఫెన్స్‌లోకి నెట్టేశారా

కూటమితో పవన్ కళ్యాణ్‌ను బాబు డిఫెన్స్‌లోకి నెట్టేశారా

ఇక ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విరుచుకుపడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా దేశ ప్రయోజనాల దృష్ట్యా ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించారు జనసేనాని. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని రాహుల్ గాంధీ పదే పదే చెప్పారు. ఇక ప్రత్యేక హోదా కోసం గళం విప్పిన పవన్ కళ్యాణ్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటారనే దానిపై చర్చ జరుగుతోంది. మరి చంద్రబాబు జాతీయస్థాయిలో కూటమి కట్టి ఇక్కడ ఏపీలో పవన్ కళ్యాణ్‌ను డిఫెన్స్‌లోకి నెట్టేశారా అనే చర్చ కూడా ప్రస్తుతం రాజకీయవర్గాల్లో జోరుగా జరుగుతోంది. అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది. జనసేనాని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కూటమితో వెళతారా... లేక ఒంటరి పోరుకే మొగ్గు చూపుతారా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

ఎన్టీఆర్ చివరిరోజుల్లో కాంగ్రెస్‌తో కలిసేందుకు సిద్ధమయ్యారు: చింతామోహన్

ఎన్టీఆర్ చివరిరోజుల్లో కాంగ్రెస్‌తో కలిసేందుకు సిద్ధమయ్యారు: చింతామోహన్

ఇక తెలుగుదేశం కాంగ్రెస్‌తో కలవడాన్ని కొందరు టీడీపీ సీనియర్ నాయకులు స్వాగతిస్తున్నారు. రాష్ట్రానికి దేశానికి బీజేపీ తీరని ద్రోహం చేస్తున్నందున కాంగ్రెస్‌తో కలిసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే హస్తం పార్టీకి షేక్‌హ్యాండ్ ఇచ్చినట్లు టీడీపీ సీనియర్ నేత చింతామోహన్ తెలిపారు. అంతేకాదు ఎన్టీఆర్ కూడా చివరిరోజుల్లో కాంగ్రెస్‌తో కలిసేందుకు మొగ్గుచూపారని గుర్తు చేశారు. ఒకవేళ పవన్ తమతో కలిసివస్తే స్వాగతిస్తామని చింతామోహన్ వెల్లడించారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు క్షణక్షణానికి ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.

English summary
Different opinions are on over AP CM Chandra babu Naidu meeting with congress president Rahul Gandhi.A few TDP leaders are opposing this move while the others are welcoming. On the other hand political analysts say that this sign looks good for Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X