బాబు కారణంగా తెలంగాణ లో కాంగ్రెస్ కు నష్టం: ఏపి లో కెసిఆర్ కారణంగా జగన్ కు తప్పదా..!
ఏపి రాజకీయాల్లో వేలు పెడతాం. ఏపికి వెళ్తాం. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా..తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వచ్చి న సమయం నుండి టిఆర్‌యస్ అధినేత చేస్తున్న వ్యాఖ్యలివి. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏపి రాజకీయాల్లో జోక్యం చేసుకోవటం అంటే జగన్ లేదా పవన్ లకు మద్దతుగా నిలవటమే. ఎంఐఎం అధినేత నేరుగా జగన్ కు మద్దతిస్తానని స్పష్టంగా చెబుతున్నారు. కెటిఆర్ వ్యాఖ్యల్లోనూ జగన్ కే మద్దతు అనే విషయం కనిపిస్తొంది. మరి..ఏపి రాజకీయాల్లో జగన్ కు మద్దతుగా టిఆర్‌యస్ నేతలు కదిలితే..ఎటువంటి ఫలితం ఉంటుంది...ఏం జరిగే అవకాశం ఉంది..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018లో గెలిచిన అభ్యర్థులు (ఫోటోలు)

కెసిఆర్ లక్ష్యం
ఏపి రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలి..చంద్రబాబు ను ఇరకాటంలో పెట్టాలని కెసిఆర్ లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే, కెసిఆర్ అంచనా వేసినంత సులువుగా ఏపి రాజకీయాల్లో జోక్యం చేసుకోగలరా అనే సందేహం వ్యక్తం అవుతోంది. కేవలం తెలంగాణకే పరిమితం అయిన టిఆర్‌యస్ ఏపి రాజకీయాల్లో నేరుగా జోక్యం చేసుకొనే పరిస్థితి లేదు. దీంతో..అక్కడ చంద్రబాబును ఇబ్బంది పెట్టాలంటే టిడిపి వ్యతిరేక పార్టీలకు మద్దతుగా నిలవాలి. అందులో భాగంగా.. వైసిపి వైపే కెసిఆర్ మొగ్గు చూపే అవకాశం ఉంది.

చంద్రబాబు ప్రయత్నం
2014 ఎన్నికల్లోనే ఏపిలో వైసిపి గెలుస్తుందని కెసిఆర్ జోస్యం చెప్పారు. కానీ, అది సాధ్యపడలేదు. ఇక, ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో చేతులు కలిపి..టిఆర్‌యస్ ను ఓడించటానికి చంద్రబాబు ప్రయత్నం చేసారని..ప్రచార చేసారనే కారణంతో ఏపిలో జోక్యం చేసకుంటామని..రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కెసిఆర్ చెబుతున్నారు. అయితే, తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు తో పొత్తు పెట్టుకోవటం వలనే అది కెసిఆర్ కు వరంగా మారిందని..దీనినే ప్రచారాస్త్రంగా మలచుకొని కెసిఆర్ సెంటిమెంట్ పండించి..ఎన్నికల్లో ఘన విజయం సాధిం చారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కు మద్దతుగా ప్రచారం చేసిన విజయశాంతి, సిపిఐ నారాయణ లాంటి వారు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

జగన్ కు మద్దతు గా నిలిస్తే
ఇక, ఏపిలో టిఆర్‌యస్ జోక్యం చేసుకుంటే వైసిపి కి లాభమా నష్టమా అనే చర్చ మొదలైంది. టిడిపికి వ్యతిరేకంగా కెసిఆర్ ఏపిలో ప్రచారం చేస్తే..అసలు ఏపిలో సమస్యలకు కారణం రాష్ట్ర విభజన అని..అందుకు కారణం కెసిఆర్ అని టిడిపి బలంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. ఏపి కష్టాలకు కారణమైన కెసిఆర్ ..జగన్ కు మద్దతు గా నిలిస్తే..తెలంగాణ లో బాబు కారణంగా కాంగ్రెస్ కు నష్టం కలిగితే..ఏపిలో కెసిఆర్ కారణంగా జగన్ కు నష్టం కలిగే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం వినిపిస్తోంది.

వైసిపి నేతల వాదన
అయితే, చంద్రబాబు సైతం తెలంగాణ ఎన్నికల్లో తొలుత టిఆర్‌యస్ తోనే కలిసి వెళ్లాలని భావించిన విషయాన్ని వైసిపి నేతలు గుర్తు చేస్తున్నారు. ఏపిని విభజించిన కాంగ్రెస్ తో జత కట్టిన చంద్రబాబు..తమకు కెసిఆర్ మద్దతుగా నిలిస్తే విమర్శించే అర్హత ఉండదన్నది వైసిపి నేతల వాదన. కెసిఆర్..అసద్ నుండి వచ్చిన ప్రతిపాదనల పై ఇప్పటి వరకు వైసిపి నేతలు స్పందించలేదు. ఇదే సమయంలో టిడిపి నేతలు మాత్రం కెసిఆర్ ఏపిలో ప్రచారం చేసుకోవచ్చని చెబుతూనే..కెసిఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తే చంద్రబాబు సీయం అవుతారని జోస్యం చెబుతున్నారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
కుమార్తెకు లోకేష్ ఊహించని పెళ్లి గిఫ్ట్ -అవాక్కైన టీడీపీ ఎమ్మెల్యే..! -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!











Click it and Unblock the Notifications