విజయవాడను ముంచింది ఆ నీరే - చంద్రబాబు..!!

వరద బాధితులందరికీ న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. రేపు ఉదయానికి వరద పూర్తిగా తగ్గిపోతుందని చెప్పారు. వైసీపీ నేతలు తప్పులు చేసి తమ పైన ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి మునిగిపోయిందనే తప్పుడు ప్రచారం సరికాదన్నారు. తమ ఇంటికి నీళ్లు వచ్చాయని విమర్శలు చేస్తున్నారని..అన్ని చోట్ల వచ్చినట్లే తమ ఇంటికి నీళ్లు వచ్చాయి.. వెళ్లాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

మా ఇంట్లో నీరు వచ్చి వెళ్లింది
విజయవాడలో సహాయక చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. 7 లక్షలమందికి సరఫరా చేసినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయన్నారు. ఇలాంటి విపత్తును తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని వివరించారు. వరద ప్రాంతాల్లో బోట్లకు ఎవరూ డబ్బులు ఇవ్వవద్దని చంద్రబాబు సూచించారు. తక్కువ ధరకే కూరగాయలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. విపత్తు సమయంలో మానవత్వం చూపించాలని కోరారు. మృతదేహాలు కనిపిస్తే అధికారులకు చెప్పాలని చంద్రబాబు సూచించారు.

Chandra Babu reveals Flood stauts and Relief measures details in Vijayawada

విమర్శలు సరికాదు
విజయవాడకు బుడమేరు చాలా సమస్యగా తయారైందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చిన్న చిన్న వాగులన్నీ కలిసి బుడమేరు పెద్దదిగా మారిందని చెప్పారు. బుడమేరును గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. అటు కృష్ణా నది, ఇటు బుడమేరు రెండూ కలిసి విజయవాడను ముంచెత్తాయన్నారు. సహాయచర్యల్లో 32 మంది ఐఏఎస్‌లు పనిచేస్తున్నారన్నారు. 179 సచివాలయాలకు 179 మంది సీనియర్‌ అధికారులను ఇన్‌ఛార్జులుగా పెట్టామన్నారు. వరద తగ్గుముఖం పడుతున్నందున బురద తొలగింపు చర్యలు ప్రారంభమయ్యాయని చెప్పారు.

న్యాయం చేస్తాం
వందకు పైగాఫైరింజన్లు వచ్చి సహాయచర్యల్లో పాల్గొన్నాయని చంద్రబాబు వివరించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు అందించాలని ఆదేశాలిచ్చామని చెప్పారు. సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎక్కడ ఎలాంటి అవసరమొచ్చినా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నామన్నారు. బుడమేరు వద్ద గండ్లు పూడిక చర్యలు కొనసాగుతున్నాయని చంద్రబాబు వెల్లడించారు. పూర్తి స్థాయిలో సహాయం అందుతుందని చెప్పలేమని..సాధ్యమైన మేర చేస్తున్నామని స్ఫష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+