వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు అబద్దాలు కొత్త కాదు .. అసెంబ్లీలో చంద్రబాబు చెప్పే అబద్దాలతో జాగ్రత్త అన్న సీఎం జగన్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు అబద్దాలు కొత్త కాదని, ఆయనతో జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా చంద్రబాబు ఎంత అబద్ధం అయినా నిస్సంశయంగా ఆడతారని అందుకే అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

బడ్జెట్ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించిన సీఎం జగన్

బడ్జెట్ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించిన సీఎం జగన్

ఆంధ్ర రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో తనదైన మార్క్ చూపిస్తూ ముందుకి నడుస్తున్నాడు . ఇక రాబోయే బడ్జెట్ సమావేశాలకు కసరత్తులు ప్రారంభించారు. రాబోవు బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో సభ్యులు ఎలా మెలగాలి, ఏయే అంశాల గురించి మాట్లాడాలి, ఇక శాసన సభ్యులు సంబంధిత డేటా ఎక్కడ నుండి కలెక్ట్ చేసుకోవాలి, దానిని అసెంబ్లీలో ఎలా ప్రజెంట్ చెయ్యాలి అన్న దానిపై ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించారు. ఇక ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు అండ్ పార్టీ వేసే ప్రశ్నలకి ఎలా సమాధానం ఇవ్వాలనే దాని గురించి కూడా జగన్ మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలకి తగిన సలహాలు ఇచ్చారు. అందరూ జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పారు.

చంద్రబాబుకు అబద్దాలు కొత్త కాదు .. వైఎస్ఆర్ సమయంలోనే నకిలీ ఫైల్ తో అసెంబ్లీలో అబద్దాలు చెప్పిన బాబు అన్న జగన్

చంద్రబాబుకు అబద్దాలు కొత్త కాదు .. వైఎస్ఆర్ సమయంలోనే నకిలీ ఫైల్ తో అసెంబ్లీలో అబద్దాలు చెప్పిన బాబు అన్న జగన్

చంద్రబాబు దేనికైనా సమర్ధుడని , అబద్దాలు చెప్పటంలో ఆయనకు ఆయనే సాటి అని పేర్కొన్న ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో ఆయన అబద్దాలు చెప్పటానికి కూడా వెనకాడని వ్యక్తి అని చెప్తూ అందుకు ఒక ఉదాహరణ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఒక సారి వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక ప్రాజెక్టు కి సంబంధించి నకిలీ ఫైల్ ఒకటి తీసుకోని వచ్చి, దానిని అసెంబ్లీలో చదివారట చంద్రబాబు . అసేలేమి జరుగుతుందో వై ఎస్సార్ కి కూడా అర్ధం కాలేదట. ఆ తర్వాత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి అన్ని చెక్ చేసుకొని అసలైన ఫైల్ తీసుకోని వచ్చి, ఏమయ్యా చంద్రబాబు అసెంబ్లీలో కూడా ఇలాంటి అబద్దాలు ఎలా చెప్పగలవని నిలదీశారట , మీరు నిజాలు చెప్పాలంటే నేను అబద్దాలు చెప్పాలంటూ నిండు సభలోనే బాహాటంగా బాబు మాట్లాడారని తన తండ్రి వై ఎస్ కు ఎదురైనా అనుభవాన్ని ఆయన ఎమ్మెల్యేలతో షేర్ చేసుకున్నారు .

ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టె యత్నం చేసినా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచన చేసిన జగన్

ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టె యత్నం చేసినా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచన చేసిన జగన్

ఇక అలాంటి వ్యక్తి చంద్రబాబు అని చెప్పి ఆయనకి అబద్దాలు వెన్నతో పెట్టిన విద్య . ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టటానికి ఎలాంటి అసత్యాలైనా చెపుతాడు, వాటికీ మనం సరైన సమాధానాలు ఇవ్వాలి అని జగన్ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. అసెంబ్లీ వేదికగా ఎవరు ఏం చేస్తున్నారో ప్రజలు చూస్తూనే ఉంటారు కాబట్టి, ఎవరు ఎలాంటి వాళ్ళో వాళ్ళకే అర్ధం అవుతుందని పేర్కొన్నారు . గతంలో మాదిరి ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే మైక్ లు ఆపినట్లు చేయటానికి వీలు లేదని వారికి అవకాశం ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు . వాళ్ళు చెప్పటానికి తగిన సమయం ఇద్దాం. ఆ తర్వాత మనం చెప్పాలనుకున్నా అది గట్టిగా, సూటిగా సుత్తి లేకుండా చెప్పాలని ఎమ్మెల్యేలకు సీఎం జగన్ దిశా నిర్దేశం చేశాడు .

English summary
The chief minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy gave a subtle warning to his party MLAs and other public representatives alike. “From now on, assembly sessions should be used effectively. Everyone might not get an opportunity to speak but you all must be prepared for it,” he said. he said to prepare for budget session .Jagan said that opposition leader chandrababu is a lier . He always speaks the lies in assembly to confuse . so be aware of the chandrababu lies said Jagan .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X