వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎస్‌ను అడుక్కోవాలా? అధికారులు హద్దు మీరొద్దు. కేబినెట్‌లో అన్నీ తేలుస్తా: బాబు ఫైర్..!

|
Google Oneindia TeluguNews

ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సీఎస్ ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం పైన విరుచుకుప‌డ్డారు. స‌మీక్ష‌ల‌కు రావాలంటూ నేను ఆయ‌న్ను అడుక్కోవాలా..చ‌దువుకోలేదా..రూల్స్ తెలియ‌వా..ఎన్ని రోజులు ఉంటారు..అంటూ ఫైర్ అయ్యారు. అధికారులు స‌ర్వీసు రూల్స్ బ్రేక్ చేస్తే స‌హించేది లేద‌ని స్ప‌ష్టం చేసారు. నా అనుభ‌వం అంత‌లేదు వీరి స‌ర్వీసు అంటూ వ్యాఖ్యానించారు. క్యాబినెట్ స‌మావేశం పెడ‌తాన‌ని..అందులో దీని పైన చ‌ర్చ చేస్తామ‌ని స్ప‌ష్టం చేసారు.

సీఎస్‌ను అడుక్కోవాలా...

సీఎస్‌ను అడుక్కోవాలా...

ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పైన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు విరుచుకుప‌డ్డారు. ముఖ్య‌మంత్రి రివ్యూ చేస్తే సీఎస్ రారా.. ఆయ‌న్ను స‌మీక్ష‌ల‌కు ర‌మ్మ‌ని అడుక్కోవాలా అని నిల‌దీసారు. బిజినెస్ రూల్స్ ప్ర‌కారం వారు ముఖ్య‌మంత్రికి రిపోర్ట్ చేయాలి. ఎన్నిక‌ల సంఘం నియ‌మించిన సీఎస్ ఉంటే ఏడాది ఉంటారు..లేదా మూడు నెల‌లు ఉంటారంటూ ఫైర్ అయ్యారు. ఏపిలో ఉన్న‌ది ఎన్నిక‌ల సంఘం సీఎస్ అని వ్యాఖ్యానించారు. మీరు చ‌దువుకోలేదా..రాజ్యంగం ప‌రిధిలో ఉన్న విధులు తెలియ‌వా..అనుభ‌వం క‌లిగిన వ్య‌క్తిగా స‌రి చేయాల్సిన బాధ్య‌త మాపై ఉంది. ముఖ్య‌మంత్రి , మంత్రులు స‌మీక్ష‌లు చేస్తుంటే అధికారులు రాకూడ‌ద‌ని ఎక్క‌డ ఉంది. దీని పై ఎన్నిక‌ల సంఘం లిఖిత పూర్వ‌కంగా ఇవ్వాలి..అప్పుడు అది నేను చూసుకుంటా అంటూ చెప్పుకొచ్చారు.

క్యాబినెట్ పెడ‌తా..తేలుస్తా..

క్యాబినెట్ పెడ‌తా..తేలుస్తా..

వారం రోజుల్లో మంత్రివ‌ర్గ స‌మావేశం ఏర్పాటు చేస్తాన‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేసారు. రాష్ట్రంలో నెల‌కొన్ని ప‌రిస్థితుల పైన స‌మీక్షిస్తామ‌ని వెల్ల‌డించారు. క్యాబినెట్ స‌మావేశం పెట్టుకోకూడ‌ద‌ని ఎక్క‌డైనా ఉందా అని ప్ర‌శ్నించారు. కేంద్రం లో నాలుగు స‌మావేశాలు పెట్టుకున్నార‌ని గుర్తు చేసారు. వారికి లేని నిబంధ‌న‌లు త‌మకు మాత్రం ఎందుక‌ని నిల‌దీసారు. అధికారులు ఎవ‌రు రారో చూస్తానంటూ హెచ్చ‌రించారు. బిజినెస్ రూల్స్ ప్ర‌కారం ఎవ‌రూ హ‌ద్దులు దాట‌కుండా వారి ప‌రిధిలో ప‌ని చేసుకోవాల‌ని సూచించారు. ఎవ‌రైనా అధికారులు రావ‌టానికి లేక‌పోతే ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న ఎక్క‌డ ఉందో చూపించాల‌ని డిమాండ్ చేసారు. ఎన్నిక‌ల విధులు సీఈవోకు..సాధార‌ణ ప‌రిపాల‌న త‌న‌కు రిపోర్ట్ చేయాల‌ని స్ప‌ష్టం చేసారు. దీని పైన క్యాబినెట్ స‌మావేశంలో తేలుస్తామ‌ని హెచ్చ‌రించారు.

వివాదం తారా స్థాయికి..

వివాదం తారా స్థాయికి..

కొద్ది రోజులు సీఎస్ పైన ముఖ్య‌మంత్రి చేస్తున్నవిమ‌ర్శ‌లు ఇప్పుడు తారా స్థాయికి చేరాయి. ఎల్వీని ఎన్నిక‌ల సంఘం సీఎస్‌గా ముఖ్య‌మంత్రి అభివ‌ర్ణించారు. ముఖ్య‌మంత్రి రాసిన లేఖ‌కు స్పంద‌న‌గా ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం ఇచ్చిన ఏక వ్యాఖ్య స‌మాధానం పైన సీఎం సీరియ‌స్‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీని పైన ఘాటుగా స్పందించాల‌ని నిర్ణ‌యించారు.
ముఖ్య‌మంత్రికి అధికారాలు లేవంటూ ఎల్వీ చేసిన వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకున్న ప్ర‌భుత్వం క్యాబినెట్ స‌మావేశం ఏర్పాటు చేసి అందులో త‌మ ముందున్న ప్ర‌త్యామ్నాయాల పైన చ‌ర్చించే అవ‌కాశం ఉంది. ఈ స‌మావేశంలో ఎన్నిక‌ల సంఘం తీరు..అధికారుల శైలి..వ్య‌వ‌హ‌రించాల్సిన తీరు తెన్నుల పైనే చ‌ర్చించే అవ‌కాశం క‌నిపిస్తోంది.

English summary
AP CM Chandra Babu fire on CS LV Subramanyam. Babu says LV is the Election commission CS. He announced that shortly he will conduct cabinet meet and review the situation. CM Appealed all officers must follow service rules.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X