జగన్ ను ఓడించాలంటే- చంద్రబాబు తేల్చేసారు : కుప్పంలోనే అలా ఉంటే : "సత్తా" ఉంటేనే టిక్కెట్లు..!!
వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలనే పట్టుదలతో చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ముందస్తుగానే కసరత్తు ప్రారంభించారు. వచ్చే ఎన్నికలు ఆషామాషీ కాదని తేల్చి చెప్పారు. జగన్ ను ఎదుర్కోవాలంటే అన్ని రకాలుగా సమర్ధత ఉన్న వారే బరిలో నిలవాలని స్పష్టం చేసారు. ఎదుర్కోలేని వారు పక్కన ఉండాలని సూచించారు. వైసీపీ రౌడీయిజం.. అరాచకాలకు ఎదురు నిలవాల్సిందేనంటూ నియోజకవర్గ ఇన్‌ఛార్జులకు టీడీపీ అధినేత స్పష్టంగా చెప్పారు.

వచ్చే ఎన్నికలు ఆషామాషీ కాదు
పార్టీ ఎమ్మెల్యేలు, శాసనసభ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, లోక్‌సభ నియోజకవర్గ పార్టీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకుల సమావేశంలో చంద్రబాబు కీలక దిశా నిర్దేశం చేసారు. వచ్చేవి ఆషామాషీ ఎన్నికలు కాదని, వైకాపా రౌడీయిజాన్ని, దౌర్జన్యాల్ని, అరాచకాల్ని ఎదుర్కొని నిలవాలంటే... ఢీ అంటే ఢీ అనే నాయకత్వమే కావాలని తేల్చి చెప్పారు. అందులో భాగంగా తాజాగా జరిగిన కుప్పం నియోజకవర్గ ఫలితాలను ప్రస్తావించారు. కుప్పం నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా చెప్పారు. అక్కడ ప్రజలు తనను ఎంతో అభిమానిస్తారని.. అటు వంటి చోట వైసీపీ టీడీపీని ఇబ్బంది పెట్టిందని చెప్పుకొచ్చారు. కుప్పంలోనే అలా ఉంటే... మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండంటూ వ్యాఖ్యానించారు.

ఢీ అంటే ఢీ అనే వారే అభ్యర్ధులు
ఇక నుంచి నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లు అంతా వారంలో మూడు రోజులు ప్రజల్లోనే ఉండాలని నిర్దేశించారు. జనవరి 18న ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఏడాది మార్చి 29కి పార్టీ ఏర్పాటై 40 ఏళ్లవుతోందని.. అదే సమయంలో వచ్చేది ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరం కావటంతో.. ఈ రెండింటినీ ఘనంగా నిర్వహించాలని స్పష్టం చేసారు. గ్రామ, వార్డు కమిటీల నియామకం ఈ నెల 15లోగా, మండల, క్లస్టర్, బూత్ కమిటీల నియామకం పూర్తి చేయాలన్నారు. అధికార పార్టీ నాయకుల అవినీతి, దోపిడీని ఎండగట్టడంలో విఫలమవుతున్నారని పార్టీ నేతలకు చురకలు వేసారు. నెల 8న రైతు సమస్యలపై, 11న నిత్యావసరాల ధరలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్దేశించారు.
Recommended Video

వైసీపీనీ ఎదుర్కొనే సత్తా ఉంటేనే ఉండండి
ఇక, చంద్రబాబు ఈ రోజు నుంచి కుప్పం లో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు సొంత నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా ఆయన స్థానిక పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. వచ్చే ఎన్నికలు అటు టీడీపీ.. ఇటు వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. రెండు పార్టీల భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలు కావటంతో.. ఈ ఎన్నికలను ఒక విధంగా సీఎం జగన్.. టీడీపీ అధినేత చంద్రబాబు డూ ఆర్ డై అనే విధంగా భావిస్తున్నాయి. అందులో భాగంగానే ఢీ అంటే ఢీ అనే వారికే పార్టీ అభ్యర్ధులుగా ఖరారు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేసారు. ఇటు ముఖ్యమంత్రి జగన్ సైతం పాలనా పరంగా వేగంగా నిర్ణయాలు మొదలు పెట్టారు. అందులో భాగంగా ఉద్యోగుల పీఆర్సీ పైన ఈ రోజు నిర్ణయం తీసుకోనున్నారు.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications