టీడీపీ కూటమి గెలిచే సీట్లపై చంద్రబాబు క్లారిటీ..!!
ఏపీలో పోలింగ్ కు కౌండ్ డౌన్ కొనసాగుతోంది. ప్రచారం చివరి దశకు చేరుకుంది. మిగిలిన అయిదు రోజులు పార్టీల అధినేతల ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ ఏపీలో రెండు రోజులు ప్రచారం చేయనున్నారు. జగన్ రోజుకు మూడు సభల్లో పాల్గొంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా వరుస సభల్లో పాల్గొంటున్నారు. తాజాగా కర్నూలు జిల్లా ప్రచారంలో ఎన్డీఏ కూటమి గెలిచే సీట్లు పైన చంద్రబాబు కీలక వ్యాఖ్యలుచేసారు.
జగన్ పై వ్యాఖ్యలు
చంద్రబాబు కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో పర్యటించారు. జగన్ ను చూస్తే తాలిబన్, బిల్ లాడెన్ గుర్తు వస్తానన్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో అంగులమైనా అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. జగన్ ది క్లాస్ వార్ ఐతే తనది క్యాష్ వార్ గా చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ పాలనను చూసి విసిగిపోయిన జనం ప్రస్తుత ఎన్నికల్లో జగన్ ను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో కూడా ఎదురుగాలి ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్రంలో ఐదేళ్లలో ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేని అసమర్థులు జగన్ అని పేర్కొన్నారు. మీ భూములను కొట్టేయాలని చూస్తున్నాడు, ప్రజల భూములను లాక్కునే అధికారం జగన్ కి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.

అన్ని సీట్లు గెలుస్తాం
ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్రంలోని రాయలసీమలో 52 సీట్లు టీడీపీ పార్టీయే గెలుస్తుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. వైసీపీని భూస్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ ది ముమ్మాటికీ మానసిక వైకల్యం అంటూ వ్యంగంగా స్పందించారు. రాష్ట్రంలో నాసిరకం మద్యంతో ప్రజల జీవితాలతో చెలగాటం ఆడారన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక ఉచితంగా ఇస్తే.. ఇప్పుడు దొరక్కుండా చేశారన్నారు. తమ హాయాంలో రూ.500కు ట్రాక్టర్ ఇసుక ఇస్తే.. ప్రస్తుతం ట్రాక్టర్ ఇసుక రూ.6000కు చేరుకుందన్నారు. ఇసుక ధరలు పెరగడం వల్ల భవన నిర్మాణ కార్మికులు రోడ్డున వడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ దోచుకున్న డబ్బు ప్రజలకు చేరాలన్నదే తమ ఉద్దేశమన్నారు. రైతులు, ఇతరుల పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకని ప్రశ్నించారు.

జాబు రావాలంటే
జగన్ ఫోటోతో ఉన్న పాస్ పుస్తకాన్ని చంద్రబాబు అక్కడికక్కడే తగలబెట్టి నిరసన వ్యక్తం చేసారు. ప్రస్తుతం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. 2019 లో ఎన్నికల ముందు అమరావతి రాజధాని అన్నారు. అధికారం వచ్చిన తర్వాత మూడు రాజధానులు పేరిట నాటకం ఆడారన్నారు. ఆ తర్వాత ఒక్క రాజధాని కూడా కట్టింది లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాయలసీమలో 198 ప్రాజెక్టులు పూర్తిగా రద్దు చేశారన్నారు. ఎక్కడాలేని జే బ్రాండ్ల మద్యం తీసుకువచ్చి ప్రజల ఆరోగ్యం గుళ్ల చేశారన్నారు. జగన్ దోచేసిన డబ్బుపై తాను పోరాడుతున్నానన్నారు. జాబు రావాలంటే బాబు రావాల్సిందేనని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ పెడతామన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అమలు చేస్తామని పేర్కొన్నారు. సైకో జగన్ ను నమ్మి మరోసారి మోసపోవద్దన్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications