బొత్సా పై పోటీకి దిగేదెవరు, గెలుస్తామా - టీడీపీలో ఉత్కంఠ..!!
విశాఖలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పై టీడీపీ కూటమిలో చర్చ జరుగుతోంది. వైసీపీ నుంచి అభ్యర్దిగా బొత్సా పేరును మాజీ సీఎం జగన్ ప్రకటించారు. స్థానిక సంస్థల్లో వైసీపీకి మెజార్టీ ఉంది. తమ సంఖ్యాబలం కాపాడుకుంటే గెలుపు ఖాయమని వైసీపీ భావిస్తోంది. ఇదే సమయంలో కూటమి అప్రమత్తమైంది. స్థానికంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పోటీతో పాటుగా అభ్యర్ది పైన చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోనున్నారు.
కూటమి నుంచి పోటీ
వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్దిగా బొత్సా ఖరారు కావటంతో కూటమిలో చర్చ మొదలైంది. ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కావటంతో కోడ్ అమల్లోకి వచ్చింది. బొత్స సత్యనారాయణపై టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నుంచి పోటీచేసే అభ్యర్థి ఎవరనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. కూటమి నుంచి రేసులో పీలా గోవింద్, గండి బాబ్జీ, పీవీజీ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అనకాపల్లి జిల్లా నేతలతో ఆ నియోజకవర్గం ఎంపీ సీఎం రమేశ్ భేటీ అయ్యారు.

బొత్సా పై అభ్యర్దిగా
ఈ ఎన్నిక పై నేడు మరోసారి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో ఉమ్మడి విశాఖ జిల్లా నేతలు భేటీ కానున్నారు. అందరి అభిప్రాయాలు తీసుకొని పోటీపై ఆసక్తి ఉన్న అభ్యర్థుల లిస్ట్ ను పల్లా శ్రీనివాసరావు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడుకు పంపించనున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకి 615 ఓట్లు ఉన్నాయి. మొత్తం 841 ఓట్లకు గాను వైసీపీకి 75 శాతం బలం ఉండగా, అధికార కూటమికి కేవలం 215 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఎన్నికల ముందు... ఆ తర్వాత కొందరు వైసీపీ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
గెలుపు దక్కేదెవరికి
ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఓటర్లను నిలబెట్టుకోవడం వైసీపీకి సవాల్‌గా మారింది. బొత్స సత్యనారాయణ బరిలో ఉండటంతో వైసీపీ అధిష్టానం గెలుపుపై ధీమాతో ఉంది. కూటమి పార్టీల నేతలుసైతం విశాఖ ఉమ్మడి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో పలువురు వైసీపీ కార్పొరేటర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీలను కూటమి వైపుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత ఈ ఎన్నికలో గెలవాలని వైసీపీ భావిస్తోంది. ఎలాగైనా తామే విజయం సాధించాలని కూటమి నేతల ప్రయత్నాల మధ్య ఎన్నిక రసవత్తరంగా మారుతోంది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications