Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2019లో మేమే: బాబు, ఎన్టీఆర్‌పై పోటీ అని టీడీపీలోకి: ఏకేసిన తలసాని

హైదరాబాద్/మహబూబ్ నగర్: 2019లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీదే అధికారమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. చంద్రబాబు ఈ రోజు పాలమూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజేంద్ర నగర్ మీదుగా వెళ్లారు.

రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఆధ్వర్యంలో వందలమంది కార్యకర్తలు, నాయకులు బాబుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒక నాయకుడు వెళ్లినంత మాత్రాన వందమందిని తయారు చేసే సత్తా టీడీపీకి ఉందన్నారు.

స్వార్థం కోసమే కొందరు నాయకులు పార్టీని మారుతున్నారని ధ్వజమెత్తారు. నాయకులు స్వార్థం కోసం పార్టీని మారుతున్నా, కార్యకర్తలు మాత్రం పార్టీలోనే ఉంటున్నారని చెప్పారు. ఢిల్లీ ఎప్పుడు వెళ్లినా ఆంధ్రాతో పాటు తెలంగాణ అభివృద్ధి పైన తాను మాట్లాడుతున్నానని చెప్పారు.

 Chandrababu aims for TDP govt in Telangana in 2019, Talasani challenges

ఎర్రబెల్లి, చంద్రబాబులపై విరుచుకుపడ్డ తలసాని

తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుల పైన సనత్ నగర్ ఎమ్మెల్యే, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం విరుచుకుపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఎర్రబెల్లి దొంగతనంగా ఎందుకు కలిశారో చెప్పాలని నిలదీశారు. తాను సనత్ నగర్ ఉప ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

ఎర్రబెల్లి దద్దమ్మ అని, బ్లాక్ మెయిలర్ అని ఆరోపించారు. చంద్రబాబు వద్ద డబ్బులు వసూలు చేసుకుంటూ పబ్బం గడుపుకుంటారని ధ్వజమెత్తారు. ఇప్పుడు టీడీపీలో ఉన్న వారంతా కలెక్షన్ కింగులేనని ఆరోపించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అభివృద్ధిని చూసి టీడీపీలో చేరారని చెప్పారు. గతంలో ఎన్టీఆర్ పైన పోటీ చేస్తానని ప్రకటించిన చంద్రబాబు ఆ తర్వాత టీడీపీలో ఏ స్వార్థంతో చేరారని ప్రశ్నించారు.

మరోవైపు, చంద్రబాబు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణలో పర్యటిస్తున్నారని తెరాస నేతలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పాలమూరును దత్తత తీసుకున్నామని గొప్పలు చెప్పుకుని, అభివృద్ధి చేయలేదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవాలని కేంద్రానికి చంద్రబాబు రాసిన లేఖపై ప్రజలు నిలదీయాలన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+