ఏపీ మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ-ఎవరెక్కడో తేల్చేయబోతున్న చంద్రబాబు..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 100 రోజులు పూర్తవుతోంది. ఈ 100 రోజుల్లో మంత్రుల పనితీరు ఎలా ఉంది, శాఖలపై వారు పట్టు పెంచుకున్నారా లేదా, సకాలంలో శాఖాపరమైన సమీక్షలు నిర్వహిస్తున్నారా లేదా, ప్రభుత్వ విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో ఎవరెక్కడ ఉన్నారనే అంశంపై సీఎం చంద్రబాబు తాజా రిపోర్ట్ తెప్పించుకున్నారు. దాన్ని రేపు
కేబినెట్ భేటీలోనే వారికి అందజేయబోతున్నారు.
రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఇందులో నూతన మద్యం పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమలుపై చర్చించనున్నారు. మద్యం పాలసీపై ప్రతిపాదనలు మంత్రివర్గ ఉపసంఘం తమ ప్రతిపాదనలు సమర్పించనుంది. అలాగే ఇటీవల వరదలు, నష్టంపైనా, కేంద్రం ఇచ్చే సాయం పైనా మంత్రులు చర్చిస్తారు. అటు వివిధ మంత్రిత్వ శాఖల నివేదికలపైనా కేబినెట్‌లో చర్చ జరగనుంది.
కేబినెట్ భేటీలోనే వరద బాధితులకు సాయంపై సీఎం చంద్రబాబు ప్రకటన చేసే అవకాశముంది.

కేబినెట్ అజెండాపై చర్చ తర్వాత వంద రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో మంత్రుల గ్రాఫ్‌ను సీఎం చంద్రబాబు వారికి అందించనున్నారు. జనసేన మంత్రుల గ్రాఫ్‌ను పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు ఇస్తారు. అనంతరం దీనిపై చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయి. మంత్రులు తమ పనితీరు మెరుగుపర్చుకునే దిశగా చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు కేబినెట్ భేటీలో మంత్రులు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరికలు చేశారు.












Click it and Unblock the Notifications