పవన్ విషయంలో తగ్గేదేలే అంటున్న చంద్రబాబు ..! మరో కీలక పోస్టు కేటాయింపు..!
ఏపీలో తాజా ఎన్నికల్లో తమతో జట్టు కట్టడమే కాకుండా కూటమి ఏర్పాటులోనూ కీలకంగా మారి ఘన విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వంలో ఎక్కడా ప్రాధాన్యం తగ్గకుండా సీఎం చంద్రబాబు చూసుకుంటున్నారు. పవన్ తో పాటు ఆయన పార్టీ జనసేనకు కూడా చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యం ఆయన సొంత పార్టీ నేతలనే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయినా చంద్రబాబు మాత్రం దీర్ఘకాలిక ప్రయోజనాల లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.
ఇదే క్రమంలో తాజాగా కీలకమైన అదనపు అడ్వకేట్ జనరల్ పదవిని జనసేన పార్టీకి చెందిన ఇవన సాంబశివ ప్రతాప్ కు కేటాయిస్తూ ప్రభుుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రతాప్ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల అయ్యాయి. జనసేన పార్టీ లీగల్ అడ్వైజర్ గా పదేళ్లుగ అంటపెట్టుకుని ఉన్న సాంబశివ ప్రతాప్ ను రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో కేసులో వాదించే ఏఏజీ పదవి ఇచ్చి గౌరవించారు. దీనిపై జనసేన నేతలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం తిల్లపూడి గ్రామానికి చెందిన సాంబశివ ప్రతాప్ ఉమ్మడి హైకోర్టులోనూ, విభజిత ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనూ సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. హైకోర్టులో దాదాపు 40 ఏళ్లుగా ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉంది. 1996 - 2002 మధ్య మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ గా ఆంధ్రా ప్రాంత మున్సిపాలిటీలకు కూడా సేవలు అందించారు.
2019 నుంచి @JanaSenaParty లీగల్ సెల్ ఛైర్మన్ గా ఉన్న ఈవన సాంబశివ ప్రతాప్ గారిని ఈ రోజ ఆంధ్రప్రదేశ్ హై కోర్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. ఆయనకు శుభాకాంక్షలు
— Bolisetty Satyanarayana (@bolisetti_satya) July 9, 2024
సాంబశివ ప్రతాప్ గారు పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు మండలం, తిల్లపూడి… pic.twitter.com/6zgegdts8B
2016-2019 మధ్య ఉమ్మడి హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది (జీపీ)గా కూడా పని చేశారు. ప్రముఖ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్ గా కూడా ప్రతాప్ వ్యవహరించారు. జనసేన ఆవిర్భావం నుంచి పార్టీకి న్యాయపరమైన సేవలు అందిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత నుంచి పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ గా ఉన్నారు.












Click it and Unblock the Notifications