అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2019కి రివర్స్: జగన్‌కు 'అమరావతి' భయం, చంద్రబాబు వ్యూహమా?

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం ఆలస్యంపై విపక్ష వైసిపి చంద్రబాబు ప్రభుత్వంపై పలుమార్లు పదేపదే విమర్శలు గుప్పించింది. రాజధాని నిర్మాణంపై ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం ఆలస్యంపై విపక్ష వైసిపి చంద్రబాబు ప్రభుత్వంపై పలుమార్లు పదేపదే విమర్శలు గుప్పించింది. రాజధాని నిర్మాణంపై ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఉద్యోగం రావాలంటే కండిషన్: ఏపీలో కేసీఆర్‌కు వెంకయ్య ప్రశంస, జగన్‌కు గడ్కరీ షాక్ఉద్యోగం రావాలంటే కండిషన్: ఏపీలో కేసీఆర్‌కు వెంకయ్య ప్రశంస, జగన్‌కు గడ్కరీ షాక్

బాబును ఇరుకున పెట్టే ప్రయత్నం, కానీ భయం

బాబును ఇరుకున పెట్టే ప్రయత్నం, కానీ భయం

చంద్రబాబు రాజధాని నిర్మాణం విషయంలో అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్నారని, అందుకే డిజైన్లు ఆలస్యమవుతున్నాయని వైసిపి ఆరోపిస్తూ టిడిపిని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. కానీ అదే వైసిపిలో మరో భయం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.

 ఆలస్యమైతే వైసిపికి ఆనందమే

ఆలస్యమైతే వైసిపికి ఆనందమే

అమరావతి డిజైన్లు ఎంతగా ఆలస్యం అయితే వైసిపికి అంతగా లబ్ధి చేకూరుతుంది. ఇప్పటి దాకా డిజైన్ల పేరు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించేందుకు వైసిపికి అవకాశముంటుంది. కాబట్టి డిజైన్ల ఆలస్యం వైసిపికి ఓ రకంగా ఆనందమై విషయమే అంటున్నారు.

 ఒక్కసారి డిజైన్లు ఓకే అయ్యాయంటే..

ఒక్కసారి డిజైన్లు ఓకే అయ్యాయంటే..

అమరావతి డిజైన్లపై చంద్రబాబు పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసారి దాదాపు ఫైనలైజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 24, 25న చంద్రబాబు నాయుడు లండన్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో డిజైన్లు ఓకే అయ్యే అవకాశముంది. డిజైన్లు ఫైనలైజ్ అయ్యాయంటే ఇక నిర్మాణాలపై చంద్రబాబు దృష్టి సారిస్తారు.

వైసిపిలో ఇప్పుడు అదే ఆందోళన

వైసిపిలో ఇప్పుడు అదే ఆందోళన

అమరావతి డిజైన్లు ఓకే అయితే రాజధాని నిర్మాణాలపై చంద్రబాబు దృష్టి సారిస్తారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇదే అంశాన్ని ప్రజల ముందుకు తీసుకు వెళ్తారు. దీంతో ప్రజలు ఇప్పటి దాకా జరిగిన ఆలస్యాన్ని పట్టించుకోరు. పైగా, ఆలస్యం ఎందుకు అయిందో కూడా చంద్రబాబు చెబుతారని, అది వైసిపికి మైనస్ అవుతుందని భావిస్తున్నారు.

రాజధాని నిర్మాణాలపై దూకుడు

రాజధాని నిర్మాణాలపై దూకుడు

ఇన్నాళ్లు రాజధాని డిజైన్లపై ఆలస్యం చేసిన చంద్రబాబు.. 2019 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఇప్పుడు వాటిపై మరింత సూచనలు చేసి ఓకే చేస్తారని, అప్పుడు నిర్మాణాలు ప్రారంభిస్తారని వైసిపి కూడా భావిస్తోంది. ఎన్నికలకు ముందు నిర్మాణాల విషయంలో సాధ్యమైనంత దూకుడుగా వ్యవహరించి, వీటిని చూపించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చంద్రబాబు మంచి ప్లాన్ వేస్తున్నారేమోనని వైసిపి నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు.

వేగవంతంగా నిర్మిస్తాం.. టిడిపికి లాభం

వేగవంతంగా నిర్మిస్తాం.. టిడిపికి లాభం

పట్టిసీమ, పోలవరం వంటి ప్రాజెక్టులను తాము రికార్డు సమయంలో పూర్తి చేశామని, అలాగే తమకు అవకాశమిస్తే ప్రపంచస్థాయి రాజధానిని వేగవంతంగా నిర్మిస్తామని ప్రజల ముందుకు వెళ్లనున్నారని, ఇది టిడిపికి లబ్ధి చేకూరేదేనని అంటున్నారు.

English summary
The Permanent Structures in Amaravati is taking more time than expected. The state government is struggling to finalize the designs for these buildings in the name of wanting the best designs which will remain as the glory of AP for generations to come.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X