చంద్రబాబువి నీఛ, నికృష్ట రాజకీయాలు ..తిన్నది అరగక టీడీపీ నేతల దీక్షలు : మంత్రి అనిల్ ఫైర్
మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టీడీపీ అధినేత చంద్రబాబుపై, టీడీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిన్నది అరగక టీడీపీ నేతలు 12 గంటలు దీక్ష చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షనేత చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కరోనా క్లిష్ట సమయంలో చంద్రబాబు నీచ, నికృష్ట రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఆయనలాంటి ప్రతిపక్షనేత ఉండటం దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు . పక్క రాష్ట్రంలో కూర్చున్న చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అనీల్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు .
Recommended Video

టీడీపీ నేతలకు తిన్నది అరగకనే దీక్షలు
కరోనా కట్టడి చర్యల్లో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ మెరుగ్గా ఉందన్నారు.కానీ చంద్రబాబు ఆయన గ్యాంగ్ పని గట్టుకుని విమర్శలు చేస్తున్నారని, తిన్నది అరక్క దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు . దేశంలో కరోనా పరీక్షలు చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని మంత్రి తెలిపారు. మొత్తం టెస్టుల్లో దేశవ్యాప్తంగా 4.5 కేసులు నమోదవుతోంటే ఏపీలో అతి తక్కువగా 1.5 శాతం కరోనా కేసులు నమోదవుతున్నాయని మంత్రి వెల్లడించారు.దేశంలో ఎక్కడా లేని విధంగా టెస్ట్‌లు నిర్వహిస్తున్నారని మంత్రి అనీల్ కుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు.

మంచి చేయకపోయినా పర్లేదు కానీ ప్రజలను భయపెట్టొద్దన్న మంత్రి
టీడీపీ అధినేత, నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించిన అనీల్ కుమార్ యాదవ్ చంద్రబాబు మంచి చేయకపోయినా పర్లేదు కానీ ప్రజలను భయపెట్టొద్దని పేర్కొన్నారు. సీఎం జగన్ ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు భయాలను పెంచుతున్నారని మండిపడ్డారు. కర్నూలు ఎంపీ ఇంట్లో నలుగురు డాక్టర్లకు పాజిటివ్ వస్తే చంద్రబాబు హేళన చేస్తున్నారని విమర్శించారు. వారు డాక్టర్లని, ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నారని మంత్రి అనీల్ వ్యాఖ్యానించారు . అటువంటి వారిని అభినందించాలి. వారిని కించ పరచడం సరికాదని పేర్కొన్నారు.

చంద్రబాబు ఏనాడైనా రైతులను ఆదుకున్నారా ?
చంద్రబాబు మౌత్ పీస్ కన్నా లక్ష్మీనారాయణ అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు . ర్యాపిడ్ టెస్టు కిట్లపై కావాలని రాద్ధాంతం చేస్తున్నారని ,ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిన తరువాత కూడా విమర్శలు చేయడంలో అర్ధం లేదని పేర్కొన్నారు అనీల్ కుమార్ యాదవ్ . మాజీ సీఎం చంద్రబాబు ఏనాడూ రైతులను ఆదుకోలేదని ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు . కరోనా కాలంలో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వంపై చంద్రబాబు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

పక్క రాష్ట్రంలో కూర్చుని చిల్లర రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు అంటూ ఫైర్
కరోనా కష్ట కాలంలో ఏ ఒక్క టీడీపీ నేత ప్రజలకు సహాయం చేసిన దాఖలాలు లేవని, కానీ విమర్శలు చెయ్యటానికి మాత్రం ముందున్నారని ఆయన పేర్కొన్నారు. ఏ ఒక్క టీడీపీ నేత అయినా ప్రజలకు సహాయం చేసారా అని నిలదీశారు . చంద్రబాబు పక్క రాష్ట్రంలో కూర్చుని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు . ఇక ఆయనకు మాట్లాడే హక్కు లేదన్న అనీల్ కుమార్ యాదవ్ రాజకీయాలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ కావాలి, ఉండడానికి మాత్రం హైదరాబాద్ కావాలా అని విమర్శలు గుప్పించారు.మా ప్రభుత్వం కరోనా కేసులు దాస్తోందని ఆరోపణలు చెయ్యటానికి బుద్ధి లేదా అని ప్రశ్నించారు .
-
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక











Click it and Unblock the Notifications