జగన్ బలం పెంచుతున్న చంద్రబాబు - పవన్..!? 2024లో జరిగేది ఇదేనా..!!

ఏపీలో రాజకీయంగా బలవంతుడెవరు. వచ్చే ఎన్నికలు ఏపీలో మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకం. ఈ సమయంలో కొత్త వ్యూహాలతో పార్టీలు ముందుకు వస్తున్నాయి. సీఎం జగన్ వై నాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి అధికారం దక్కదని పవన్ నినదిస్తున్నారు. వంద శాతం టీడీపీదే గెలుపని చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. కానీ, గెలిచేది ఒక్కరే. జగన్ ను ఓడించటానికి ప్రతిపక్షాలను ఏకం చేస్తానని పవన్ చెబుతున్నారు. అందరూ కలవాలని చంద్రబాబు పిలుపునిస్తున్నారు. అక్కడే ఈ వ్యాఖ్యలతో జగన్ బలం పెంచుతున్నారు. తమ కంటే జగన్ రాజకీయంగా బలంగా ఉన్నారని పరోక్షంగా అంగీకరిస్తున్నారు. అదే ఇప్పుడు రానున్న ఎన్నికల్లో జగన్ కు సగం బలం. పొత్తులే లేకపోతే ప్రతిపక్షాలు వైసీపీకి పోటీ ఇవ్వలేవా. పొత్తులు లేకపోతే వైసీపీకే తిరిగి అధికారం ఖాయమా..

పొత్తుల పేరుతో పరోక్షంగా..

పొత్తుల పేరుతో పరోక్షంగా..


ఇప్పుడు టీడీపీ - జనసేనలో ప్రధానంగా వినిపిస్తున్న అంశం ఎన్నికల పొత్తులు. 2019 ఎన్నికల్లో పొత్తులు లేని కారణంగానే వైసీపీ అధికారంలోకి వచ్చిందని తాజాగా పవన్ విశ్లేషించారు. కానీ, పొత్తులు లేని కారణంగానే అప్పటి వరకు అధికారంలో ఉన్న టీడీపీ వ్యతిరేక ఓటు చీలి చంద్రబాబుకు ఫలితాలు అనుకూలంగా ఉండాలి. కానీ, అలా జరగలేదు. చంద్రబాబు - పవన్ వ్యతిరేక ఓటు..జగన్ అనుకూల ఓటు రెండు కలిసి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తాను బాధ్యత తీసుకుంటానని..అందరినీ ఏకం చేస్తానని పవన్ చెబుతున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం తమకు పాజిటివ్ ఓటు తిరిగి తము అధికారంలోకి తెస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే జగన్ అనుకూలంగా మలచుకుంటున్నారు. తనను ఓడించేందుకు ఇంతమంది ఏకం అవుతున్నారని చెప్పుకొస్తున్నారు. ఎవరెవరు కలిసినా..తాను సింగిల్ గానే ఎదుర్కొంటానంటూ ఆత్మవిశ్వసం ప్రదర్శిస్తున్నారు.

పొత్తుల వ్యవహారమే జగన్ కు ఆయుధంగా

పొత్తుల వ్యవహారమే జగన్ కు ఆయుధంగా


ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకండా పార్టీలు కలవాల్సిన అవసరం పవన్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈ పొత్తుల వ్యవహారమే వైసీపీకి క్షేత్ర స్థాయిలో తమకు కలిసి వస్తుందని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు. బీజేపీ కలిసి వచ్చినా లేకపోయినా టీడీపీ - జనసేన పొత్తు ఖాయమని వైసీపీ అంచనా వేస్తోంది. పవన్ పైన సామాజిక బాణంతో వైసీపీ ఇరుకున పెట్టే వ్యూహం మొదలు పెట్టింది. కాపుల ఓట్లను తీసుకెళ్లి చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని మైండ గేమ్ ప్రారంభించింది. దీనికి పవన్ ప్రభావితం అయ్యారు. తాను ఎవరి పల్లకి మోయటం లేదని స్పష్టత ఇచ్చారు. మరి..పొత్తులు కుదిరితే చంద్రబాబు - పవన్ లో ఒకరు సీఎం అవ్వాలి. పవన్ ను సీఎంగా చేసేందుకు టీడీపీ శ్రేణులు సిద్దంగా ఉంటాయా అంటే అనుమానమే. అదే సమయంలో సొంతగా ఎదుగుతూ..బలం పెంచుకొనే ప్రయత్నం చేస్తున్న పవన్ తిరిగి చంద్రబాబును సీఎం చేద్దామంటే వైసీపీ విమర్శలు జనసేన మద్దతు దారులపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.

పొత్తుల్లో సీఎం ఎవరు..సమీకరణాలు సహకరిస్తాయా

పొత్తుల్లో సీఎం ఎవరు..సమీకరణాలు సహకరిస్తాయా


పవన్ ను అభిమానించే వారు..మాజీ ప్రజారాజ్యం నేతలు.. మెగా ఫ్యాన్స్ పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. టీడీపీ నేతలు జనసేనతో పొత్తు ద్వారా సీట్లలో..ప్రభుత్వంలో భాగస్వామ్యం వరకు అభ్యంతరం లేదని చెబుతున్నారు. కానీ, పవన్ ను సీఎం చేయాలనే డిమాండ్ తెర మీదకు వస్తే టీడీపీ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపిస్తోంది. పవన్ అభిమానించే వారు మాత్రం తమ నేతే సీఎంగా ముందుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కారణాలతోనే తాజాగా పవన్ వ్యూహం తనకు వదిలేయాలంటూ సూచిస్తున్నారు. ఎవరికీ కొమ్ము కాయనని..జనసేన అధికారంలోకి వస్తుందని చెప్పుకొస్తున్నారు. పవన్ సీఎం కావాలన్నా.. చంద్రబాబు సీఎం కావాలన్నా వీరిద్దరి ఒకరికి ఒకరు సహకరించుకుంటేనే సాధ్యమనేది పొలిటికల్ సర్కిల్స్ లో కామన్ గా జరుగుతున్న చర్చ. 2014లో పవన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబుకు మద్దతు ఇవ్వటంతో ఏ సమస్యా తలెత్తలేదు. ఇప్పుడు పవన్ సీఎం రేసులోకి వచ్చారు. అదే ఇప్పుడు చంద్రబాబుకు అసలు సమస్య. దీంతో, ఇప్పుడు ఈ పొత్తుల వ్యవహారం ఏ టర్న్ తీసుకుటుందనేది ఆసక్తిగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+