తెలంగాణాకు లేని విద్యుత్ సమస్య ఏపీకే ఎందుకు? జగన్ సర్కార్ కు చంద్రబాబు, టీడీపీ నేతల ప్రశ్నల వర్షం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న విద్యుత్ సంక్షోభంపై జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ విరుచుకుపడుతున్నారు టిడిపి నేతలు. ప్రజలు జగన్ మోహన్ రెడ్డికి పవర్ ఇస్తే జనాలకు పవర్ లేకుండా చేస్తున్నాడు అంటూ ధ్వజమెత్తుతున్నారు. సీఎం జగన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్లే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై, విద్యుత్ కొరత పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.

రాష్ట్రాన్ని జగన్ రెడ్డి నాశనం చేశారన్న చంద్రబాబు
రాష్ట్రంలో ఆరు సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై మొత్తం 36 వేల కోట్ల భారం మోపారని చంద్రబాబు జగన్ సర్కార్ పై ధ్వజమెత్తారు. దక్షిణాది రాష్ట్రాల అన్నింటికంటే ఏపీ లోనే విద్యుత్ చార్జీలు అధికంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు టిడిపి ముఖ్య నేతల సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రాన్ని జగన్ రెడ్డి నాశనం చేశారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఎలాంటి విద్యుత్ చార్జీలు పెంచలేదని, పవన విద్యుత్, సోలార్ విద్యుత్ తీసుకొచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు.

కమీషన్ల కోసమే.. విద్యుత్ కొనడానికి కృత్రిమ విద్యుత్ కొరత సృష్టించారు
జగన్ ప్రభుత్వం బొగ్గుకు కూడా డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉందని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. డిస్కం లకు ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు బకాయి ఉన్న 22 వేల కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కమీషన్ల కోసమే బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనడానికి కృత్రిమంగా విద్యుత్ కొరతను సృష్టించారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేయిస్తే, బహిరంగ మార్కెట్లో 15 రూపాయలు నుంచి 20 రూపాయలు పెట్టి కొనాల్సిన అవసరం రాదని చంద్రబాబు స్పష్టం చేశారు.

తెలంగాణాకు లేని విద్యుత్ సమస్య ఏపీకే ఎందుకు : ప్రశ్నిస్తున్న టీడీపీ
పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు లేని సమస్య ఏపీకే ఎందుకు వచ్చిందని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ కొరత లేదని, అలాంటిది ఏపీకి ఎందుకు ఇంత తీవ్రంగా విద్యుత్ కొరత ఉందని టిడిపి నేతలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మొన్నటికి మొన్న విద్యుత్ సంక్షోభానికి సీఎం జగన్ కారణమని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, విధానమే తాజా పరిస్థితి కారణమని ఆయన మండిపడ్డారు. విభజన నాటికి ఏపీ విద్యుత్ విషయంలో మిగులు లో ఉంటే తెలంగాణ లోటు లో ఉందని కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయి తెలంగాణ మిగులు లో ఉంటే ఏపీ లోటు లోఉండటానికి గల కారణం ఏమిటని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.

జగన్ రివర్స్ గేర్ పాలనలో ప్రజలు లాంతరు పట్టుకుని తిరగడం ఖాయం : పట్టాభి
ఏపీలో విద్యుత్ సంస్థలు దివాలా తీయడం వెనుక కూడా వైసీపీ కక్ష సాధింపు చర్యలు ఉన్నాయని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఇక నిన్నటికి నిన్న జగన్ సర్కార్ ను టార్గెట్ చేసిన పట్టాభి విద్యుత్ వ్యవస్థ సరిగా లేకపోతే రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎలా లభిస్తాయి అంటూ నిలదీశారు. సీఎం జగన్ అసమర్థత, చేతగానితనం తో రాష్ట్రంలో విద్యుత్ పరంగా సర్వనాశనమై పోయిందని పట్టాభి మండిపడ్డారు. జగన్ రివర్స్ గేర్ పాలనలో ప్రజలు లాంతరు పట్టుకుని తిరగడం ఖాయం అంటూ ఎద్దేవా చేశారు.
Recommended Video

జగన్ సర్కార్ చేతగానితనం వల్లే విద్యుత్ సంక్షోభం
విద్యుత్ శాఖ లో ఏం జరుగుతుందో కనీసం మంత్రివర్యులకు తెలియదని మండిపడ్డారు. ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం చోటు చేసుకుందని, ఈ నేపథ్యంలో ప్రజలు విద్యుత్తు జాగ్రత్తగా వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇదే సమయంలో విద్యుత్ రంగంలో రాష్ట్రం కుదేలు అవడం జగన్ చేతగాని తనం వల్లే అంటూ టిడిపి నేతలు జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications