పనితీరు ఆధారంగా పార్టీ నేతలకు ర్యాంకులిచ్చిన బాబు

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు టిడిపి ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇచ్చారు.అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ర్యాంకులను ఇచ్చారు. మంత్రులు, పార్టీ నేతలకు కూడ చంద్రబాబునాయుడు ర్యాంకులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులో భాగంగానే చంద్రబాబునాయుడు మంగళవారం నాడు పార్టీ నేతలకు ర్యాంకులు ఇచ్చారు.పార్టీ ప‌నిలోనూ, ప్ర‌భుత్వ విధానాల‌లోనూ వారి ప‌నితీరు ఆధారంగా నేత‌ల‌కు ర్యాంకులు కేటాయించే ప‌ద్ధ‌తికి చంద్రబాబే శ్రీకారం చుట్టారు. ఇటీవల ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ఎవరి పనితీరు ఎలా ఉందనే దానిపై చంద్రబాబు ర్యాంకులు ప్రకటించారు.

Chandrababu announces ranks to party leaders

విపక్ష పార్టీలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను సమర్ధవంతంగా తిప్పికొట్టడంలో ఏపీ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ప్రథమ స్థానంలో నిలిచారు. సాగు నీటి శాఖ మంత్రిగా ఉన్న దేవినేని ఉమా మహేశ్వర్ రావు ‌ అగ్రస్థానంలో నిలిచారు.

మీడియాకు ప్రజెంటేషన్‌లో టిడిపి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అగ్రస్థానంలో నిలిచారు.ఆ తర్వాతి స్థానంలో బుద్దా వెంకన్న నిలిచారు.మూడో స్థానంలో జీవి ఆంజనేయులు నిలిచారు. బెస్ట్ సప్లిమెంటరీ అవార్డు ఎమ్మెల్యే వర్మకు దక్కింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+