"ఆటో డ్రైవర్ల సేవలో" పథకం అప్పుడే..! కొత్త డేట్ ఇచ్చిన చంద్రబాబు..!
ఏపీలో కూటమి సర్కార్ కీలక ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15 వేల చొప్పున ఇచ్చేలా ఆటో డ్రైవర్లకు సేవలో అనే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించబోతోంది. ఇప్పటికే ఈ పథకం కోసం 3 లక్షల మందికి పైగా లబ్దిదారుల్ని కూడా గుర్తించారు. వీరికి నిధులు ఎప్పుడు ఇవ్వాలన్న దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే అక్టోబర్ 1 అని, 2 అని తేదీలు ప్రకటిస్తూ వస్తున్న ప్రభుత్వం మరోసారి వీటిని మార్చింది.
ఇవాళ సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీల అమలుపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. ఇందులో
అక్టోబర్ 4వ తేదీన 'ఆటో డ్రైవర్ల సేవలో' కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు సీఎం వెల్లడించారు. చాలా ఆలోచించి పేదల సేవలో అనే పేరు పెట్టమన్నారు. ప్రతి నెలా ఫించన్లు అందించే కార్యక్రమంలో పాల్గొనడం తనకు చాలా సంతృప్తినిస్తోందన్నారు.

టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి మరోసారి కూడా ఎన్నికలకు వెళ్లాయని చంద్రబాబు తేల్చిచెప్పారు. అభివృద్ధి-సంక్షేమం-సుపరిపాలన ద్వారా రాష్ట్ర పునర్ నిర్మాణం చేస్తామని చెప్పామని, నాడు చెప్పాం.. నేడు చేసి చూపుతున్నామని చంద్రబాబు వెల్లడించారు. ఆటో డ్రైవర్ల సేవలో పేరుతో ప్రతి ఏడాది రూ.15 వేలు ఇస్తామన్నారు. అక్టోబరు 4వ తేదీన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

2,90,234 మంది డ్రైవర్లు ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో లబ్దిదారులుగా ఉన్నారని, ఏదైనా కారణాల వల్లనైనా ఎవరైనా లబ్దిదారుల జాబితాలో పేరు లేకపోతే... వారి సమస్యలను పరిష్కరించి వారినీ లబ్దిదారుల జాబితాలో చేరుస్తామన్నారు.
ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆటో డ్రైవర్ల స్కీంను వర్తింప చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకానికి రూ.435 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం రూ.12 వేలు మాత్రమే ఇచ్చేదని, తాము మాత్రం రూ. 15 వేలు ఇస్తున్నట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications