వెళ్లాలనుకున్నాకానీ, అలా నిర్మిస్తా: బాబు(పిక్చర్స్)
హైదరాబాద్: హుధుద్ తుపాను వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలకు ఉల్లిగడ్డలు చేరుకున్నాయి. కర్మూలు, మహారాష్ట్ర నుంచి ఈ ఉల్లిగడ్డలు వచ్చాయి. విశాఖపట్నం-1,387 మెట్రిక్ టన్నులు, విజయనగరం-107, శ్రీకాకుళం-81 మెట్రిక్ టన్నులు సరఫరా చేశారు. వీటిని రైతు బజార్లలో కిలో ఐదు రూపాయలకు విక్రయిస్తారు.
హుధుద్‌కు మించిన తుపానులు వచ్చినా తట్టుకుని నిలబడేలా నగరాన్ని పునర్నిర్మిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. ప్రకృతి విధ్వంసం సృష్టించినా, దాన్ని సరిదిద్దేందుకు తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానన్నారు. విశాఖను నిర్మించేందుకు అందరు విరాళాలు ఇవ్వాలని కోరారు. హుధుద్ తుపానుతో తీవ్రంగా నష్టపోయిన నగరంలో సాధారణ పరిస్థితులు తీసుకువచ్చే విషయంలో తను ఇంకా సంతృప్తి చెందలేదన్నారు.
అధికారులను ఇంకా పరుగులు పెట్టిస్తానన్నారు. వాస్తవానికి శనివారం సాయంత్రం విశాఖ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వెళ్లాలని అనుకున్నానని, కానీ మరోరోజు కూడా ఇక్కడ ఉండకపోతే, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేమని అభిప్రాయపడ్డారు. దీపావళికి ముందే ఉత్తరాంధ్ర ప్రజల్లో వెలుగులు నింపాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.

చంద్రబాబు
ఇప్పటికే పెట్రోలు, డీజిల్ సరఫరా సాధారణ స్థితికి వచ్చిందన్నారు. నగరంలో ప్రతి ఇంటికి రోజుకు గంట చొప్పున తాగునీరు అందిస్తామని చంద్రబాబు చెప్పారు. విద్యుత్ సరఫరాను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నట్టు చెప్పారు. ప్రతి గంటకూ మంత్రులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వివిధ రూపాల్లో అందుతున్న సహాయం పేద ప్రజలకు అందేలా చూడటం తమ బాధ్యతన్నారు.

చంద్రబాబు
ఇన్ఫోసిస్ సుధామూర్తి, నవయుగ ప్రతినిధులతో మాట్లాడుతున్నానని, వారిని నగర సుందరీకరణలో భాగస్వాములను చేస్తానని చెప్పారు. అలాగే ఏజెన్సీలోని కాఫీ తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, వాటి పునరుద్ధరణకు త్వరితగతిన చర్యలు తీసుకుంటామన్నారు. తుపానులో దెబ్బతిన్న సరుగుడు పంటకు కూడా ఎకరాకు 12,500 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించానన్నారు. నేలకూలిన పశువుల కొట్టాల పునర్నిర్మాణానికి రూ.10 వేలు ఇస్తామన్నారు.

చంద్రబాబు
చంద్రబాబు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి స్టీల్ ప్లాంట్‌ను సందర్శించారు. ప్లాంట్‌లోని కోకోవెన్, బ్లాస్ట్ ఫర్నేస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘ నేతలు చంద్రబాబును కలిసి ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్ర నిధులు రప్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్లాంట్‌ను ప్రయివేటీకరించ వద్దని చంద్రబాబును కోరారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుందామని హామీ ఇచ్చారు. తుపానువల్ల 300 కోట్లు నష్టం వాటిల్లిందని, ఇది పునరుద్ధరణకు 20 రోజులైనా పడుతుందని చెప్పారు.

చంద్రబాబు
చంద్రబాబు ఇన్స్యూరెన్స్ కంపెనీల ప్రతినిధులు, పాలసీ హోల్డర్లతో భేటీ అయ్యారు. తుపాను బీభత్సానికి చాలా భవనాలు, కంపెనీలు, ఆస్తులు దెబ్బతిన్నాయని, బీమా చెల్లింపులో ఉదాసీనత ప్రదర్శించవద్దని కోరారు. వీలైనంత త్వరగా పాలసీ మొత్తాలు అందాలని సూచించారు. ధ్వంసమైన భవనాలు, దుకాణాలకు ఫొటోలు తీసి అప్‌లోడ్ చేశారని, వాటిని ఆధారంగా చేసుకుని బీమా చెల్లించాలని చంద్రబాబు కోరారు.

చంద్రబాబు
హుధుద్ తుపాను వల్ల ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనలేదని, చెత్త తొలగింపు పనులు పూర్తికానందున విశాఖ ప్రజలు దీపావళి చేసుకోవద్దని చంద్రబాబు విజ్ఞప్తిచేశారు. చెత్తపై బాణాసంచా పడి అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు దీపాలు వెలిగించుకోవాలని కోరారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా దీపావళి మందుగుండు సామాగ్రి, బాణాసంచా దుకాణాల లైసెన్స్లను రద్దు చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ యువరాజ్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications