రాజమండ్రి జైలు సిబ్బందికి కొత్త తలనొప్పి

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుణ్ని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. దీనివల్ల జైలు సిబ్బందికి కొత్త కష్టం వచ్చింది. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాబుతో నేను పేరుతో లక్షలాది ఉత్తరాలను పంపిస్తున్నారు. ప్రస్తుతం అది ఒక ఉద్యమంలా మారింది.

సెప్టెంబర్ 18వ తేదీ నుంచి ఈ ఉత్తరాల ప్రవాహం మొదలవగా.. 20వ తేదీన 2150 ఉత్తరాలు, 21న 6250 ఉత్తరాలు, 22న 8340 ఉత్తరాలు, 23న అత్యధికంగా 23,570 ఉత్తరాలొచ్చాయి. ఈ పోస్టుకార్డులు కాకుండా అదనంగా రిజిస్టర్డ్ పోస్టులు, స్పీడ్ పోస్టులు వస్తున్నాయి. ప్పటి వరకూ చంద్రబాబు నాయుడికి 50 వేల లేఖలు పంపించినట్లు తపాలా శాఖ తెలిపింది.

chandrababu arrest latest updates

చంద్రబాబు నాయుడి అరెస్ట్‌ను నిరసిస్తూ.. రాష్ట్ర ప్రజలు 7 లక్షల లేఖలు రాశారని తెలుగుదేశం పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. ఈ లేఖలు చంద్రబాబుకు చేరకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని, అయినా ప్రజలచేత లేకలు రాయనివ్వకుండా ఉండలేరన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజానగరం నియోజకవర్గ ఇన్ చార్జి బొడ్డు వెంకట రమణ, రాజమండ్రి దాన్వాయిపేటలోని తపాలాశాఖ కార్యాలయానికి వెళ్లి.. లేఖలకు సంబంధించిన వివరాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకూ 50 వేల లేఖలు మాత్రమే చంద్రబాబుకి చేరాయని.. మిగతా లేఖలు ఎక్కడని ప్రశ్నించారు.

చంద్రబాబుకు వచ్చే లేఖలు తీసుకువెళ్లేందుకు రాజమండ్రి జైలు నుంచి ఓ అధికారి వస్తున్నారని తపాలాశాఖ అధికారులు చెప్పినట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. మరో రెండు రోజుల్లో రాజమండ్రికి మిగతా లేఖలు కూడా చేరుకుంటాయని, వీటిని తీసుకువెళ్లడం జైలు సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+