ఏపీలో మంత్రులు టీడీపీ ఆఫీస్ లో డ్యూటీ చేయవలెను.. షిఫ్టులు ఇలా!!
తెలుగుదేశం పార్టీ శ్రేణుల కోసం ఎన్టీఆర్ భవన్‌లో నిత్యం మంత్రులు అందుబాటులో ఉండాలని ఆదేశించిన చంద్రబాబు ఈ మేరకు వారికి విధులు కేటాయిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇప్పటికే జులై నెలలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రులు, కీలక నేతలకు షిఫ్ట్ వేసి మరీ అందుబాటులో ఉండేలా చేశారు. ఇక ఇదే సమయంలో తాజాగా మరోమారు చంద్రబాబు మంత్రులకు షిఫ్ట్ లు వేశారు.
అందుబాటులో ఉండనున్న రాష్ట్రమంత్రులు, జాతీయ నాయకులు
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలనుసారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాయలంలో రాష్ట్ర మంత్రులు మరియు టీడీపీ జాతీయ నాయకులు పార్టీ శ్రేణుల కోసం అందుబాటులో ఉండనున్నారు. కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండనున్న రాష్ట్ర మంత్రలు మరియు టీడీపీ జాతీయ నాయకుల వివరాలు ఇలా ఉన్నాయి.

ఆగస్ట్ లో పార్టీ కార్యాలయంలో చంద్రబాబు
ఆగస్ట్ 1 నాడు ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు మరియు మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు. ఆగస్ట్ 2న మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరియు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ అందుబాటులో ఉంటారు. ఆగస్ట్ 3వ తేదీన టీడీపీ అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ అందుబాటులో ఉంటారు.
మంత్రులకు చంద్రబాబు డ్యూటీలు
ఆగస్ట్ 5న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, మరియు జాతీయ ఉపాధ్యక్షులు బొల్లినేని రామారావు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. ఆగస్ట్ 6న మంత్రి వంగలపూడి అనిత మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర పార్టీ కార్యాలయంలో ఉండనున్నారు. ఆగస్ట్ 8న మంత్రి పొంగూరు నారాయణ మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహార్ టీడీపీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉంటారు.
ఆగస్టులో రెండు సార్లు పార్టీ ఆఫీసులో అందుబాటులో చంద్రబాబు
ఆగస్ట్ 8న మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి మరియు జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల సూర్య ప్రకాష్ , ఆగస్టు 9న మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ అందుబాటులో ఉంటారు. ఆగస్ట్ 10న మళ్ళీ సీఎం నారా చంద్రబాబు నాయుడు , రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ అందుబాటులో ఉంటారు.
ఆగస్ట్ 14 వరకు మంత్రులకు టీడీపీ ఆఫీస్ లో షిఫ్ట్
ఆగస్ట్ 12న మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అందుబాటులో ఉన్నారు.ఆగస్ట్ 13న మంత్రి టీ.జీ. భరత్ , జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి అందుబాటులో ఉంటారు. ఆగస్ట్ 14 న మంత్రి డా. డోలా బాలవీరాంజనేయ స్వామి, జాతీయ ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి అందుబాటులో ఉండనున్నారు.
-
మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
గ్రామాల్లోకి కూడా "అన్నా క్యాంటీన్లు"..! -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు రేపే-లోకేష్ కీలక ప్రకటన..! -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాల్లో బాలికలే టాప్-ఉత్తీర్ణతా శాతాలివే..! సప్లిమెంటరీ షెడ్యూల్..! -
AP Inter Results 2026 Release: ఇంటర్ ఫలితాల విడుదల -ఇలా చెక్ చేసుకోండి..! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!!












Click it and Unblock the Notifications