సాక్షితో విషం కక్కుతున్నారు, భయపడను: బాబు, టిడిపిలోకి మరికొందరు
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పైన పరోక్షంగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొందరు కులాల పేరుతో ఉద్దరిస్తామంటూ బయలుదేరారని ఎద్దేవా చేశారు.
తాను అధికారంలోకి వచ్చే వరకు వారు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ప్రజల బలహీనతను సొమ్ము చేసుకోవడానికి కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని, మోసపోవద్దని హితవు పలికారు.

తాను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సుదీర్ఘ పాదయాత్ర చేశానని, అప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకున్నానని చెప్పారు. పాదయాత్ర సమయంలో తాను తన కాలు నొప్పిని, అలాగే తెలుసుకున్న ప్రజల కష్టాలను మరిచిపోనని చంద్రబాబు చెప్పారు.
ఇవాళ రాజకీయాలు మాట్లాడను
నిత్యమూ అభివృద్ధి కోసం తపిస్తున్న తాను, వైసిపి నేతలు చేస్తున్న తుచ్ఛ రాజకీయాలపై స్పందించాల్సిన అవసరం లేదని చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా కోటప్పకొండలో త్రికోటేశ్వరుని దర్శించుకున్న అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. సాక్షి పత్రికలో వస్తున్న భూదందాలపై తాను నేడు మాట్లాడనన్నారు.
ఆ విషయమై మరో రోజు మాట్లాడుకుందామని, నేడు ఓ పవిత్ర కార్యక్రమం కోసం తాను వచ్చానని చెప్పారు. పైగా పక్కనే స్పీకర్ కోడెల ఉన్నందున రాజకీయం మాట్లాడటం తగదన్నారు. అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని, దేశంలోనే ఏపీని మొదటి స్థానంలో నిలపడమే తన కర్తవ్యమన్నారు. కోటప్పకొండ అభివృద్ధికి అన్ని రకాలుగా నిధులిస్తామని తెలిపారు.
త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్న చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఉధయం గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండలోని త్రికోటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అర్చకుల ఆశీర్వాదాలు స్వీకరించారు.
అమరావతి అందరి ఆత్మగౌరవం
అమరావతి అందరి నగరమని, ఆత్మగౌరవమని చంద్రబాబు అన్నారు. విపక్షాలు ఎంత చేసినా అభివృద్ధిపై వెనుకడుగు వేసేది లేదన్నారు. రాజధాని పైన విషం కక్కడం విడ్డూరమన్నారు. ఎక్కడ చూసినా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా వెనుకడుగేయమన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయమన్నారు. డబ్బుపై పిచ్చితో రాష్ట్రాన్ని లూటీ చేసినవాళ్లు ఇంకా దోచుకోవాలనుకుంటున్నారన్నారు. అవినీతి సంపాదనతో పెట్టిన పత్రిక, ఛానెల్ రాజధానిపై విషం కక్కుతున్నాయని సాక్షిపై ధ్వజమెత్తారు.
ఈడీకి అటాచ్ చేసిన పత్రిక తప్పుడు ప్రచారంతో బురద జల్లుతోందన్నారు. ప్రజా రాజధానిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరుతున్నానని, ఎవరైనా అభివృద్ధికి అడ్డుపడితే బెదిరిపోను, వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు. వారు ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదన్నారు.
రాష్ట్రం బాగుపడుతుంటే ప్రతిపక్షనేతలు చూడలేకపోతున్నారని, ఓర్వలేకపోతున్నారన్నారు. రాజధాని నిర్మాణానికి ప్రతిపక్ష నేతలు అడుగడుగునా అడ్డం పడుతున్నారన్నారు. రాజధాని ప్రాంతంలో టిడిపి నేతలు భూములు కొనుగోలు చేశారంటూ పత్రికల్లో పిచ్చి రాతలు రాస్తున్నారన్నారు. రాజధాని కోసం భూసమీకరణలో భాగంగా 33 వేల ఎకరాలను రైతులు ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.
జగన్ ట్రాప్‌లో పడొద్దు: గాలి
ముద్రగడ పద్మనాభం, మందకృష్ణ మాదిగలు జగన్ ట్రాప్‌లో పడవద్దని టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు సూచించారు. కుల, వర్గ రాజకీయాలతో విభేదాలు సృష్టించేందుకు వైసిపి ప్రయత్నిస్తోందన్నారు. కాపు గర్జన సమయంలో వైసిపి గూండాలే రైళ్లు తగులబెట్టారని చెప్పారు. జగన్‌ను నమ్ముకొని కులాన్ని మోసం చేయవద్దని సూచించారు. మాదిగలకు మందకృష్ణ వెన్నుపోటు పొడిచారన్నారు.
టిడిపిలోకి చేరికలు
టిడిపిలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కొందరు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు టిడిపిలో చేరారు. అందులో వైసిపి మద్దతుతో గెలిచిన వారు కూడా ఉన్నారు. సీఎం చంద్రబాబు సమక్షంలో వారు సైకిల్ ఎక్కారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తన మొదటి ప్రాధాన్యత ఉభయ గోదావరి జిల్లాలకే అని చెప్పారు.
-
ఆ విషయంలో ఎవరిమాట వినొద్దు అని కలెక్టర్ లకు సీఎం చంద్రబాబు ఆదేశం! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!!












Click it and Unblock the Notifications