పోరు చేస్తుంటే ఆటంకాలు కల్పిస్తారా: జగన్‌పై చంద్రబాబు ఫైర్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

  TDP MP's Are Jokers

  కేంద్ర ప్రభుత్వం తీరుపైనా ఆయన వ్యాఖ్యలు చేశారు. మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వానికి తాము సహకరిస్తున్నామని, జిఎస్టీకీ నోట్ల రద్దుకు కూడా కేంద్రానికి తాము సహకరించామని ఆయన అన్నారు.

  లేఖలతో ఆటంకాలు కల్పిస్తున్నారు...

  లేఖలతో ఆటంకాలు కల్పిస్తున్నారు...

  లేఖల ద్వారా ప్రతిపక్షం అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తోందని చంద్రబాబు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీరుపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పట్టుబట్టిన కేంద్ర మంత్రిపై ప్రతిపక్షం ఫిర్యాదు చేయడం శోచనీయమని అన్నారు.

  సమాన స్థాయి వచ్చే వరకు సాయం

  సమాన స్థాయి వచ్చే వరకు సాయం


  ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సమాన స్థాయి వచ్చే వరకు కేంద్రం రాష్ట్రానికి సహకరించాలని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేయాల్సిందేనని ఆయన అన్నారు.

  ఆ రోజు స్వాతంత్ర్యం కోసం...

  ఆ రోజు స్వాతంత్ర్యం కోసం...

  స్వాతంత్ర్యం కోసం పోరాటంం చేయడం గత చరిత్ర అయితే రాష్ట్ర ప్రయోనాల కోసం పోరాటం చేయడం ప్రస్తుత చరిత్ర అని చంద్రబాబు అన్నారు. ఉభయ సభల్లో రాష్ట్రం కోసం పోరాడుతున్న పార్లమెంటు సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు. సోమవారం ఆయన టిడిపి ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

  అలా చేస్తే ప్రజలను ఇబ్బంది పెట్టడమే...

  అలా చేస్తే ప్రజలను ఇబ్బంది పెట్టడమే...


  రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడమటే ప్రజలను ఇబ్బంది పెట్టడమేనని చంద్రబాబు అన్నారు. ఉపాధి నిధులపై ఫర్యాదులు ప్రతిపక్షం అరాచాకాలకు పరాకాష్ట అని ఆయన వైసిపిపై విరుచుకుపడ్డారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Andhra Pradesh CM Nara Chandrababuidu has lashed out at the YSR Congress party saying was creating hurdles.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి