మహిళా కమిషన్ సమన్లపై ఉత్కంఠ-విచారణకు చంద్రబాబు, బోండా డుమ్మా ? అదే జరిగితే!

ఏపీలోని విజయవాడలో జరిగిన గ్యాంగ్ రేప్ బాధితురాలిని పరామర్శించే సమయంలో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను దూషించారంటూ చంద్రబాబు, బోండా ఉమకు నోటీసులు పంపారు. ఈ నోటీసుల ప్రకారం ఈ నెల 27 అంటే రేపు తాడేపల్లిలోని మహిళా కమిషన్ కార్యాలయానికి వీరిద్దరూ హాజరు కావాల్సి ఉంది. అయితే వీరిద్దరూ విచారణకు హాజరయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. అదే జరిగితే తదుపరి కమిషన్ ఏం చేయబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది.

విజయవాడ గ్యాంగ్ రేప్ ఘటన

విజయవాడ గ్యాంగ్ రేప్ ఘటన

విజయవాడ వాంబే కాలనీలో నివసిస్తున్న ఓ మానసిక వికలాంగురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి 30 గంటల పాటు ఆమెపై ముగ్గురు సామూహిక అత్యాచారం జరిపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన జరిగిందని తెలియగానే రాజకీయ నేతలు ప్రభుత్వాసుపత్రికి క్యూకట్టారు. బాధితురాలిని పరామర్శించారు. ఇదే క్రమంలో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా అక్కడికి వచ్చారు.

అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ కూడా వచ్చారు. దీంతో ఉద్రికత నెలకొంది. మహిళా కమిషన్ ఏం చేస్తోందంటూ బోండా ఉమ ప్రశ్నించడంతో వాసిరెడ్డి పద్మ అసహనానికి గురై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది.

చంద్రబాబు, బోండాకు సమన్లు

చంద్రబాబు, బోండాకు సమన్లు

ప్రభుత్వాసుపత్రిలో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి వద్మ తనను దూషించిన చంద్రబాబు, బోండా ఉమకు నోటీసులు పంపారు. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. దీంతో తనను దూషించిన కేసులో తానే నోటీసులు జారీ చేసి తానే విచారణ చేయడమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ నెల 27న చంద్రబాబు, బోండా ఉమ హాజరుపైనా సందిగ్ధత నెలకొంటోంది. ఈ లోపు వైసీపీ, టీడీపీ మధ్య దీనిపై మాటల యుద్ధం కూడా ముదురుతోంది. ఈ నేపథ్యంలో రేపు ఏం జరగబోతోందనే ఉత్కంఠ పెరుగుతోంది.

టీడీపీ వాదన ఇదే

టీడీపీ వాదన ఇదే

మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ ను ఎవరైనా దూషిస్తే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయాలని, అప్పుడు వారు విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని, అలా చేయకుండా నేరుగా ఆమే నోటీసులు పంపడం చెల్లదని టీడీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు, బోండా ఉమకు సమన్లు జారీ చేసి అధికారం వాసిరెడ్డి వద్మకు లేదని ఆ పార్టీ విమర్శిస్తోంది. దీంతో ఈ వ్యవహారంలో న్యాయనిపుణులు కూడా తమదైన రీతిలో వాదనలు వినిపిస్తున్నారు. మహిళా కమిషన్ పరిధి దాటి వ్యవహరిస్తోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయినా ఇవేవీ పట్టించుకోకుండా వాసిరెడ్డి పద్మ తనకు నోటీసులు జారీ చేసి అధికారం ఉందని చెప్తున్నారు.

చంద్రబాబు, బోండా డుమ్మా?

చంద్రబాబు, బోండా డుమ్మా?

మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా ఉన్న వాసిరెడ్డి వద్మను దూషించిన వ్యవహారంలో చంద్రబాబు, బోండా ఉమను విచారణకు రావాలని సమన్లు ఇప్పటికే పంపారు. అయితే ఈ సమన్ల ఆధారంగా వారు విచారణకు హాజరయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. విచారణకు వెళ్లేది లేదని ఇప్పటికే బోండా ఉమ స్పష్టం చేశారు. చంద్రబాబు కూడా అదే వైఖరి తీసుకునే అవకాశముంది.

అదే జరిగితే అప్పుడు మహిళాకమిషన్ ఎలా వ్యవహరిస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే పరిమిత అధికారాలు కలిగిన మహిళా కమిషన్ గురించి అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగడం ఖాయం. దీనిపై ఏవరైనా కోర్టును ఆశ్రయిస్తే అప్పుడు కోర్టు ఇచ్చే ఆదేశాలు కూడా కీలకం కానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+