Chandrababu: పొత్తుల్లో సీట్లు కోల్పోతున్న నేతలకు చంద్రబాబు బంపర్ ఆఫర్ ?
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ సీట్ల పంపకాల్లో మునిగితేలుతున్నాయి. ముఖ్యంగా విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడం ఖాయమైన నేపథ్యంలో ఈ మూడు పార్టీల మధ్య సీట్ల పంపకాలు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఇప్పటికే టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పలుమార్లు సమావేశమై సీట్ల పంపకాలపై దాదాపు ఓ అంచనాకు వచ్చేశారు. కేవలం బీజేపీతో మాత్రమే ఇప్పుడు సీట్ల సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంది.
ఈ తరుణంలో పొత్తుల కారణంగా టీడీపీ భారీ సంఖ్యలో సీట్లను మిత్రపక్షాలైన జనసేన, బీజేపీకి కేటాయించాల్సిన పరిస్ధితి ఉంది. దీనిపై సొంత పార్టీలోనే అసంతృప్తులు పెరుగుతున్నారు. దీన్ని గమనించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఆయన ముఖ్యంగా పొత్తుల కారణంగా సీట్లను త్యాగం చేయాల్సిన పరిస్ధితిపై నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా వారికి కీలక హామీ ఇచ్చారు.

పార్టీని నమ్ముకున్న వారికి కచ్చితంగా భవిష్యత్తులో ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు సీట్లు కోల్పోతున్న నేతలకు హామీ ఇచ్చారు. సీఎం జగన్ తో విసిగిపోయి నేతలు భారీ ఎత్తున టీడీపీలో చేరేందుకు వస్తున్నారని, వారిని పార్టీలో చేర్చుకోవడం వల్ల పలు చోట్ల ఇప్పటివరకూ పార్టీని నమ్ముకుని ఉన్న నేతలు సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్దితి ఉందని చంద్రబాబు నేతలకు గుర్తుచేశారు. అలాగే పొత్తుల నేపథ్యంలో ఎవరూ నిరుత్సాహానికి గురి కావొద్దన్నారు. పొత్తులకు సహకరించే వారికి భవిష్యత్తులో కచ్చితంగా నామినేటెడ్ పదవులిస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications